సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహం తర్వాత కూడా దూసుకుపోతోంది. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది.
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహం తర్వాత కూడా దూసుకుపోతోంది. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నయన్ నటిస్తోంది.
చాలా కాలం పాటు సహజీవనం చేసిన నయన్, విగ్నేష్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. నయనతార, విగ్నేష్ శివన్ జోడి ఎక్కడ కనిపించినా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున జనసంద్రంలా మారడం చూస్తూనే ఉన్నాం. నయనతార హీరోయిన్ గా సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోంది.
నయన్, విగ్నేష్ కలసి ఆ మధ్యన సొంత ప్రొడక్షన్ కూడా ప్రారంభించారు. నయనతార అనేక వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. తాజాగా నయన్ కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతునట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఆల్రెడీ మహేష్ బాబు, అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్ ప్రారంభించారు.
మహేష్ బాబు ఏఎంబి సినిమాలో భాగస్వామి. అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ నిర్మాణం జరుగుతోంది. నయనతార కూడా అదే తరహాలో విలాసవంతమైన, అత్యాధునికమైన మల్టిఫ్లెక్స్ ని చెన్నైలో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో మూతపడ్డ అగస్త్య థియేటర్ ని నయన్ కొనుగోలు చేసి దాని స్థానంలో కొత్త మల్టిఫ్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై నయన్, విగ్నేష్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
