`బేబీ`సినిమాపై సుకుమార్ లాంటి వారు ప్రశంసించారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ సైతం తన ప్రశంసలు కురిపించారు.
`బేబీ` సినిమా సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. చిన్న సినిమాగా ప్రారంభమై ఇది రికార్డులు షేక్ చేస్తుంది. పది-పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా డెబ్బై కోట్లు దాటింది. ఇంకా విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సినిమాపై క్రిటిక్స్, సినిమా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుకుమార్ లాంటి వారు కూడా సినిమా అద్బుతంగా ఉందంటూ ప్రశంసించారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ సైతం తన ప్రశంసలు కురిపించారు.
`బేబీ` సినిమా చూసిన ఆయన మూవీపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈసినిమా గురించి గొప్పగా రాసుకొచ్చారు. ఈ కమింగ్ ఏజ్ మూవీకి దెబ్బకి క్రేజీ రికార్డులు బద్దలవుతున్నాయి. ఇది బోల్డ్ టీమ్ చేసిన ప్రయత్నం. బోల్డ్ గా రాయడమే కాదు, అంతే క్రూరంగా తెరపైకి ఎక్కించారు. ఇది గొప్ప విజయం సాధించినందుకు అభినందనలు` అని తెలిపారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది. దీనిపై దర్శకుడు సాయి రాజేష్, హీరో ఆనంద్ దేవరకొండస్పందిస్తూ విగ్నేష్ శివన్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన `బేబీ` సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్‌కేఎన్ నిర్మించారు. జులై 14న ఈసినిమా విడుదలైన విషయం తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రేపటి వరకు ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని చెప్పొచ్చు.
