దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు విజ్ఞేశ్ శివన్ తో కలిసి క్రిస్మస్ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రైస్తవ మతానికి చెందిన నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ప్రతి ఏడాది క్రిస్మస్పండగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంటుంది నయన్.

ఈ ఏడాది తన ప్రియుడితో సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ''అందరికీ హ్యాపీ అండ్ జాయ్ ఫుల్ క్రిస్మస్ శుభాకాంక్షలు'' అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోంది.