కోలీవుడ్ లో ముద్దులంటే గుర్తుకొచ్చే ముద్దుగుమ్మ నయన్ ఇప్పుడు ముద్దులంటే ససేమిరా అంటున్న నయనతార విగ్నేష్ శివన్ తో ప్రేమాయణమే కారణమంటున్న కోలీవుడ్ వర్గాలు
ముప్పయ్యేళ్ల వయసు దాటి ముగ్గురి తో పీకల్లోతు ప్రేమాయణం సాగించిన నయనతార ఇక పై హీరోలకు లిప్ లాక్ ఇవ్వకూడదని నిర్ణయించుకుందట. ఘాటు ప్రేమాయణం సాగించి ముగ్గురు ప్రేమికులను మార్చిన ఈ భామ తమిళనాట స్టార్ హీరోయిన్. ప్రౌఢ వయసులో వరుస సక్సెస్ లు అందుకుంటున్న ఈ భామ ఇకపై లిప్ లాక్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట .
ప్రస్తుతం దర్శకులు విగ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి . ఆ పుకార్ల కు తగ్గట్లుగా ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్లినా చెట్టా పట్టాలేసుకొని తిరగడమే కాకుండా ఒకే అపార్ట్ మెంట్ లో కలిసి ఉంటున్నారు . ప్రేమ వ్యవహారం అంతగా కలిసి రాకపోవడంతో కాబోలు సహజీవనం చేస్తోంది . అందుకే ఇకపై హీరోలకు లిప్ లాక్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యిందట నయనతార .
