సినిమాల్లో పెద్దగా ఎక్సపీరియన్స్  లేని ఓ కుర్రాడు ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. అతనే ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేం నవీన్‌ పోలిశెట్టి. యూట్యూబర్‌గా, థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన నవీన్‌కు ఇది మొదట సినిమా. డిటెక్టివ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండువారాల క్రితం విడుదలై తెలుగులో మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ  నేపధ్యంలో వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు నవీన్. 

ఈ 29 సంవత్సరాల కుర్రాడు తన తదుపరి చిత్రం ఖరారు చేసుకున్నారు. పిట్టగోడ అనే చిన్న చిత్రంతో దర్శుకుడుగా మారిన అనుదీప్ అనే మరో యంగ్ డైరక్టర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం స్క్రీన్ ప్లే బేసెడ్ గా సాగేదని, పూర్తి ఫన్ తో నడిచే కథ అని చెప్తున్నారు.  ఓ పాపుల్ డైలీకు ఇచ్చిన ఇంటర్వూ ఈ విషయాన్ని ధృవికరించాడు.  అయితే ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రిలీజ్ కు ముందే సైన్ చేసిన ప్రాజెక్టు ఇది. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ..హీరోతో పాటు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 
 
నవీన్ మాట్లాడుతూ.... బెంగళూరులో థియేటర్‌ ఆర్ట్స్‌ చేశా. హైదరాబాద్‌లో ఓ థియేటర్‌ ఆర్ట్స్‌ వర్క్‌షాప్‌లో నేను, విజయ్‌ దేవరకొండ కలిశాం. అప్పటి నుంచి మేం ఫ్రెండ్స్‌. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో లీడ్‌ రోల్స్‌ కోసం ప్రయత్నిస్తే, హీరో ఆపోజిట్‌ గ్యాంగ్‌కి ఎంపికయ్యాం. ప్రస్తుతం హిందీలో నితీష్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘చిచ్చొరే’ సినిమాలో ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నాను అన్నారు.