నవీన్ పోలిశెట్టి గత ఏడాది అమెరికాలో బైకు యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలని నవీన్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు బయటపెట్టలేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ తర్వాత ఈ సంఘటన జరిగింది.

నవీన్ పోలిశెట్టి గత ఏడాది అమెరికాలో బైకు యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలని నవీన్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు బయటపెట్టలేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ తర్వాత ఈ సంఘటన జరిగింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో నవీన్ తదుపరి చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. 

అయితే నవీన్ పోలిశెట్టి తన నెక్స్ట్ మూవీని ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. దీనితో నవీన్ కి జరిగిన యాక్సిడెంట్ పై, అతడి హెల్త్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలు తొలగిపోయేలా తొలిసారి నవీన్ పోలిశెట్టి స్పందించారు. ప్రస్తుతం నవీన్ యుఎస్ లోనే ఉంటూ కోలుకుంటున్నారు. 

'హాయ్.. నేను ఈ రోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. దురదృష్టవశాత్తూ నా చేతికి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలికి కూడా గాయమైంది. ఇది నాకు కెరీర్ పరంగా కూడా చాలా టాప్ టైం. అందుకే వేంగంగా మీ ముందుకు నా చిత్రాలు తీసుకురాలేకున్నా. అందుకు నన్ను క్షమించండి. గత కొన్ని రోజులు చాలా టాప్ గా గడిచాయి. నేను పూర్తిగా కోలుకుని నా ఎనెర్జిటిక్ వెర్షన్ మీకు చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ సాయం తీసుకుని వర్క్ చేస్తున్నా. 

View post on Instagram

నేను పూర్తిగా కోలుకోవడానికి ఇంకొన్ని నెలల సమయం పడుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే నా తదుపరి చిత్ర స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వస్తోంది. నేను కోలుకోగానే షూటింగ్ మొదలవుతుంది. అప్పుడు కూడా ఇలాగే నాపై ప్రేమ కురిపిస్తారని ఆశిస్తున్నట్లు నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు

నవీన్ పోలిశెట్టి తదుపరి చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఉండబోతోంది. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థలకు కూడా నవీన్ కమిట్మెంట్ ఇచ్చాడు.