రానా నాయుడు వెబ్ సిరీస్ పై వస్తున్న నెగెటీవ్ టాక్ పై స్పందించారు హీరో నవదీప్. సినిమా నచ్చకపోతే ట్రెండింగ్ లోకి ఎలా వచ్చిందంటూ ప్రశ్నిచారు నవదీప్.. ఇంకా ఏమన్నారంటే..?
వెంకటేశ్ - రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ మూవీ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్.. రిలీజ్ కు ముందు చాలా హైప్ క్రియేట్ చేసి.. రిలీజ్ తరువాత మాత్రం అనేక విమర్శలను మూటగట్టుకుంది వెబ్ సిరీస్. వెంకటేశ్ వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో, ఇలాంటి ఏ సర్టిఫికెట్ సినిమా చేయడం ఎవరికీ నచ్చలేదు. వెంకటేష్ ఇలాంటి రోల్ చేయడమేంటి.. అని అంతా చెవులు కొరుక్కోవడం స్టార్ట్ చేశారు. అనే ప్రశ్న ఎక్కువగా వినిపించింది. అసలు ఈ పాత్రలు వెంకటేష్.. రానాలు చేసి ఉండకూడదు అని అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో .. రానా నాయుడు గురించి మాట్లాడారు యంగ్ హీరో నవదీప్.
నవదీప్ మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ ఇంతకు ముందు జనరేషన్స్ కు నచ్చకపోవచ్చు.. కాని ఈజనరేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా జనరేషన్ ఈ వెబ్ సిరీస్ ను సరదాగా చూస్తున్నారు.. అందులో తప్పులు ఎవరూ వెతుక్కోవడం లేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు నచ్చలేదని మీరు అంటున్నారు బాగానే ఉంది. మరి నాలాగా ఈ వెబ్ సిరీస్ ను ఎంజాయ్ చేసేవాళ్లు కూడా కొన్ని కోట్ల మంది ఉంటారు. అలా ఉండటం వలన .. చూడటం వల్లనే కదా అది ట్రెండింగులో నెంబర్ వన్ గా ఉందని నేను అంటున్నాను .. ఇక చర్చ ఏముంటుంది? అన్నాడు.
మాకు నచ్చలేదు .. మాకు నచ్చలేదు అని మీరు అంటున్నారు. ఎందుకు నచ్చలేదు అని నేను అడగడం లేదు. నాలాంటి వారికి ఎందుకు నచ్చిందనేది మాత్రమే నేను చెబుతున్నాను. మీరు వ్యక్తం చేసే అభ్యంతరాలను నేను కొట్టిపారేయడం లేదు. కాకపోతే మేము అంత దూరం ఆలోచన చేయలేదు. అది ముంబై నేపథ్యంలో జరిగిన కథ గనుక, అక్కడి కల్చర్ ఎలా ఉంటుందో తెలుసును గనుక మేము సరదాగా చూశామంతే అంటూ నవదీప్ చెప్పుకొచ్చారు.
