నేచురల్‌ స్టార్‌ నాని,డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'గ్యాంగ్ లీడర్'. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి.

సెప్టెంబర్‌ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నాని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని.. ట్విస్ట్‌లు టర్న్‌లు ఉన్నాసరే అవి అంత కాంప్లికేటెడ్‌ గా ఉండవని చెప్పారు.

సినిమాలో తను పెన్సిల్ పార్ధసారధి అనే పాత్రలో నటించినట్లు చెప్పారు. ఈ క్రమంలో బైలింగ్యువల్ సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. గతంలో తను ద్విభాషా చిత్రం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా.. అందుకే బైలింగ్యువల్ అంటే తనకు భయమని చెప్పాడు.

అదిరిపోయే స్క్రిప్ట్ తో మంచి సెటప్ కుదరాలని.. అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయంటేనే బైలింగ్యువల్ చేస్తాను కానీ.. ఇంకో చోట కలెక్షన్స్ వస్తాయి కదా అని బైలింగ్యువల్ చేయడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని 'వి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.