తాను నటి పవిత్ర లోకేష్‌ని వివాహం చేసుకున్నట్టు నటుడు నరేష్‌ ఓ వీడియోని పంచుకున్నట్టు విషయం తెలిసిందే. మరి ఇది నిజం పెళ్లా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆయన్ని మీడియా ప్రశ్నించింది. 

నటుడు నరేష్‌, పవిత్ర లోకేష్‌ పెళ్లి ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతుంది. అనూహ్యంగా నరేష్‌ .. తన పెళ్లి వీడియోని శుక్రవారం మార్నింగ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పవిత్రతో ఏడడుగులు నడిచినట్టు వెల్లడించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జంటకి విషెస్‌ తెలియజేస్తున్నాయి. అయితే వీరి పెళ్లిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజం పెళ్లి కాదనే కామెంట్లు ఊపందుకున్నాయి. ఓ సినిమా కోసం ఈ ఇద్దరు ఆడుతున్న డ్రామా అని అంటున్నారు. సినిమాలోని సీన్‌ని ఇలా షేర్‌ చేసుకున్నారని, త్వరలోనే ఆ డిటెయిల్స్ రాబోతున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే తాజాగా నరేష్‌.. `ఇంటింటి రామాయణం` అనే సినిమా ప్రెస్‌ మీట్లో పాల్గొన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్‌మీట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో నరేష్‌ పాల్గొన్నారు. ఇందులో ఆయన పెళ్లి ప్రస్తావన వచ్చింది. మీడియా ప్రతినిధి ఆయన పెళ్లి గురించి ప్రస్తావించగా, సమాధానం దాటవేశారు. సినిమా గురించే మాట్లాడదామని చెప్పారు. అనంతరం మరోసారి అదే ప్రశ్న ఎదురయ్యింది. ప్రభాస్‌, సల్మాన్‌ ఖాన్‌ల పెళ్లి కంటే ఇప్పుడు మీ పెళ్లి మ్యాటరే హాట్‌ టాపిక్‌ అవుతుంది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఎప్పుడు పెళ్లి భోజనం పెట్టబోతున్నారని ప్రశ్నించగా, 

దీనిపై రియాక్ట్ అయ్యారు నరేష్‌. నవ్వుతూ ఈ టాపిక్‌ని డైవర్ట్ చేయదలుచుకోలేదు. దానికి సంబంధించి త్వరలోనే ఓ ప్రెస్‌మీట్‌ పెడతాను. రీల్‌ లైఫ్‌, రియల్‌ లైఫ్‌ ప్రతి వ్యక్తికి ఉంటాయి. నా లైఫ్‌ని నేను జీవిస్తున్నా. ఈ ప్రెస్‌ మీట్‌ని మరో విధంగా డైవర్ట్ చేయదలుచుకోవడం లేదు` అని తెలిపారు. దీంతో ప్రస్తుతానికి తన పెళ్లి ప్రస్తావనకి ఫుల్‌ స్టాప్‌ పెట్టారు. అయినప్పటికీ ఈ వీరిద్దరి పెళ్లి నెట్టింట రచ్చ చేస్తుండటం విశేషం. 

నరేష్‌, పవిత్ర లోకేష్‌ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని, కలిసే ఉంటున్నారనే వార్తలొచ్చాయి. ఇద్దరు కలిసి చాలా ఈవెంట్లకి, దేవుడి గుళ్లకి వెళ్లారు. అంతేకాదు ఆ మధ్య ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నట్టు ప్రకటించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు. ఇప్పుడు సడెన్‌గా పెళ్లి వీడియో షేర్‌ చేస్తూ పెళ్లి అయిపోయిందని, ఆశీస్సులు కావాలని చెప్పడంతో అంతా షాక్‌ అయ్యారు. అయితే చూడ్డానికి ఆ వీడియో నిజమైన పెళ్లి వీడియో లాగా లేకపోవడంతో అనుమానాలు ఊపందుకున్నాయి. మరి ఇది నిజమైన పెళ్లా?, సినిమా పెళ్లా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.