నారా రోహిత్ పెళ్లి ఎప్పుడు. ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా కాలం అవుతున్న పెళ్లిపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా తన పెళ్లి డేట్ పై రోహిత్ ఏమన్నాడు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారు అవుతున్నారు. ఈక్రమంలో యంగ్ హీరో నారా రోహిత్ కూడా త్వరలో ఓ ఇంటివాడు అవ్వబోతున్నాడు. గతంలోనే రోహిత్ పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. ఓ హీరోయిన్ ను ప్రేమించిన రోహిత్, గత ఏడాది ఎంగ్మెంట్ కూడా చేసుకున్నాడు. కాని పెళ్లి మాత్రం జరగలేదు.
పెళ్లిపై నారా రోహిత్ ప్రకటన
ఇక తాజాగా నారా రోహిత్ తన వివాహంపై అధికారిక ప్రకటన చేశారు. రీసెంట్ గా రోహిత్ నటించిన భైరవం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్, ఈ సినిమా విజయోత్సవ సభలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం షేర్ చేశారు.
నారా రోహిత్ పెళ్లి లేట్ అవ్వడానికి కారణం
వారసత్వంగా రాజకీయ కుటుంబంలో పుట్టిన నారా రోహిత్, సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీలో ఆయన నటించిన భైరవం సినిమా రిలీజ్ అయ్యి మంచి స్పందన అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మా నాన్నగారు రామ్మూర్తి నాయుడుగారి సంవత్సరికం పూర్తయిన తర్వాత అక్టోబర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం,” అని వెల్లడించారు.
నారా రోహిత్ పెళ్లి చేసుకోబోయేది ఎవరిని
నారా రోహిత్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సిరితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి నిశ్చితార్థం గతేడాది(2024) అక్టోబర్లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వెంటనే డిసెంబర్లో జరగాల్సి ఉండగా, తండ్రి రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మృతిచెందడం వల్ల రోహిత్ పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చింది. దాంతో ఆయన మరణించిన ఏడాది తారువాత పెళ్లి చేసుకోవల్సి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ లో నారా రోహిత్ పెళ్లి ఘనంగా జరగబోతోంది.
ఇక రోహిత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సిరి విషయానికి వస్తే.. అచ్చ తెలుగు అమ్మాయి, సిరి స్వస్థలం రెంటచింతల ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించారు. నారా రోహిత్, సిరి కలిసి నటించిన చిత్రం ‘ప్రతినిధి 2’. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో అక్టోబర్లో వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారు.ప్రస్తుతం సిరి, పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓజీ' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.