నారా రోహిత్ కొద్ది కాలం క్రితం వరకూ కొత్త దర్శకులకు వరం. కథ పట్టుకుని రోహిత్ దగ్గరకు వెళ్లి మెప్పిస్తే ప్రాజెక్టు పట్టాలెక్కేస్తుందనే నమ్మకం. దాంతో చాలా మంది నారా రోహిత్ ని దృష్టిలో పెట్టుకుని కథలు చేసుసుకునేవారు. అందుకు తగ్గట్లే నారా రోహిత్ ప్లానింగ్ ఉండేది.  వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.  ఏ హీరో టచ్ చేయలేని స్క్రిప్టులతో సినిమాలు చేస్తూ.. తనదైన ఇమేజ్‌ను కైవసం చేసుకున్నాడు. ఒక టైమ్ లో అయితే మూడు వారాల్లో రెండు సినిమాలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. 

ఆ టైమ్ లో  ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, అప్పట్లో ఒకడుండేవాడు, జో అచ్యుతానంద వంటి నావెల్టీ ఉన్న కథలూ ఎంచుకున్నాడు. దాంతో కొత్త దర్శకులు క్యూ కట్టారు. అయితే ఇప్పుడా పరిస్దితి లేదు. వరసగా ఆయన సినిమా డిజాస్టర్స్ అవుతూ వచ్చాయి.

‘కథలో రాజకుమారి’, ‘ఆటగాళ్లు’, ‘వీర భోగ వసంత రాయులు’ సినిమాలు ఆయన శ్రద్దగా తయారు చేసుకున్న ఇమేజ్ ని ఒక్క దెబ్బతో కూల్చేసాయి. దాంతో మళ్లీ హిట్ కొట్టేదాకా...నిర్మాతలు దగ్గర చేరేటట్లు లేరు. దర్శకులు అయితే ఆయన్ని దృష్టిలో పెట్టుకుని కథలు రాయటం లేదు. అయితే ప్రతీ హీరో కెరీర్ లోనూ ఈ ఫేజ్ అనేది వస్తుంది. ముఖ్యంగా కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లే హీరోలకు అయితే మరీను. 

ప్రస్తుతం ఆయన ఇమేజ్ తిరిగి బిల్డ్ అవ్వాలంటే...ఆయన నటిస్తున్న శబ్దం, అనగనగా దక్షినాదిలో చిత్రాలు ఆడి తీరాలి. అప్పుడే నారా రోహిత్ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాడు. అప్పటిదాకా షట్టర్స్ క్లోజ్ చేసినట్లే.