న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మరో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ నగరానికి ఏమైంది ఫెమ్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫలక్‌నుమా దాస్ సినిమాతో రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ హీరోతో నాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తన వాల్ పోస్టర్ బ్యానర్ లో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఫలక్‌నుమా దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన నాని త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని అన్నారు. మొదట ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ అ! సినిమాను నిర్మించిన నాని నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. 

మాస్ ఆడియెన్స్ ని ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం మంచి కలెక్షన్స్ అందాయి. ఇక నెక్స్ట్ మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, ప్రస్తుతం మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోన్న విశ్వక్ సేన్ తో సినిమా చేయాలనీ నాని ప్లాన్ చేస్తున్నాడు.