Asianet News TeluguAsianet News Telugu

#Naniమళ్లీ YSRCP పై సెటైర్,ఎందుకిలా కెలకటం?

నాని సున్నితంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్య నాయకులతో పాటు అన్ని పార్టీలకు చెందిన నాయకులను ఏదో ఒక విధంగా ఇమిటేట్‌ చేయడం ...

Nani targets and directs satires on YSRCP politicians jsp
Author
First Published Nov 19, 2023, 1:47 PM IST


 ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా సమయంలో సినిమా టిక్కెట్ల ధరల విషయమై కిరాణా దుకాణం ప్రస్తావన తెస్తూ నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యిన సంగతి తెలిసిందే. . టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం సరికాదన్న ఆయన.. టికెట్ల రేట్లు తగ్గిస్తే ప్రేక్షకుల్ని అవమానించినట్టే అని అన్నారు. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉందని.. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందంటూ నాని అప్పుడు అన్నారు.నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. 

ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ పోతే ఊరుకునేది లేదంటూ నాని వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇండస్ట్రీ పెద్దలు కానీ.. బడా నిర్మాతలు కానీ ఈ ఇష్యూపై పెద్దగా స్పందించలేదు. దిల్ రాజు అయితే.. ప్రెస్ మీట్ పెట్టి.. ఈ ఇష్యూపై ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడొద్దని.. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 ఆ తర్వాత  ఓ ఇంటర్వ్యూలో ఆనాటి వివాదంపై నాని తనదైన స్టయిల్లో వివరణ ఇచ్చాడు. ‘నేను కిరాణా దుకాణంలో పని చేశాను. సమోసాలు, ఎస్టీడీ బూత్.. ఇవన్నీ కలిసే వుండేవి.. కిరాణా దుకాణంలో మెయిన్‌టెనెన్స్ 15 వేలు వున్నప్పుడు.. 25 వేలు వస్తే.. లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది ఆ యజమానికి. అదే సినిమా థియేటర్‌ని లక్షలు పెట్టి నిర్వహించాల్సి వచ్చినప్పుడు, అందుకు తగ్గట్టుగా సంపాదన వుండాలి కదా.. అదే నేను చెప్పింది. కానీ, అది కొందరికి వేరే అర్థంలో వినిపించింది. అలాంటి వాళ్ళతోనే సమస్య..’ అంటూ నాని వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ టాపిక్ ఎందుకు అంటే...ఇప్పుడు మళ్లీ తను వదిలిన ఓ వీడియోలో నాని ..కిరాణా షాప్ ల  ప్రస్తావన తెచ్చారు.

ప్రస్తుతం ఎలక్షన్‌ సీజన్‌ నడుస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని తాను కూడా పొలిటీషన్‌ రూపంలో నాని కనిపించాడు. ఒక పొలిటీషన్ గా హాయ్ నాన్న సినిమా ప్రమోషన్‌ ను చేశాడు. ఆ సమయంలో పలువురు పొలిటీషియన్స్ ను అనుసరించడంతో పాటు కొందరిపై సెటైర్‌ వేశాడు. ముఖ్య నాయకులతో పాటు అన్ని పార్టీలకు చెందిన నాయకులను ఏదో ఒక విధంగా ఇమిటేట్‌ చేయడం మాత్రమే కాకుండా, అన్ని పార్టీలు కూడా నోటికి వచ్చినట్లు హామీలు ఇస్తూ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయంటూ నాని సున్నితంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్య నాయకులతో పాటు అన్ని పార్టీలకు చెందిన నాయకులను ఏదో ఒక విధంగా ఇమిటేట్‌ చేయడం మాత్రమే కాకుండా, అన్ని పార్టీలు కూడా నోటికి వచ్చినట్లు హామీలు ఇస్తూ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయంటూ నాని సున్నితంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది.
 
'మన పార్టీని అధికారంలోకి తీసుకొస్తే యూత్ అంతా విచ్చలవిడిగా రీల్స్ చేసుకోడానికి స్మార్ట్ ఫోన్లను కిట్ కిట్ లుగా పంచిపెడతాం. అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం. థియేటర్ల ఆదాయం.. ఆ పక్కనే ఉన్న కిరాణా కొట్టోళ్ళ ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం'' అని చెప్పాడు. 'అప్పుడు సబ్జెక్ట్ టాపిక్ తెలియకుండా అదే పట్టుకొని ఇష్టమొచ్చినట్లు వాగేవాళ్ళ ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం' అంటూ పనిలో పనిగా తన కిరాణా కొట్టు కాంట్రవర్సీపై సెటైర్ వేశారు.   అలానే ఇటీవల మీడియా మిత్రులను ఉద్దేశిస్తూ యాంకర్ సుమ చేసిన కామెంట్స్ పై వివాదం చెలరేగడంపైనా నాని సెటైర్లు వేశారు. సారీ చెప్పాడని తాను యాంకర్ ను కాదని, పొలిటిషియన్ అంటూ నాని ముగించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios