అంటే సుందరానికీ మూవీ... తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ స్టార్ట్ దక్కించుకుంది. ఈ చిత్ర ఫస్ట్ డే వసూళ్లు నిరాశాజనకంగా ఉన్నాయి. మధ్యాహ్నం షోస్ వరకు, అంటే సుందరానికీ కలెక్షన్స్ చాలా డల్ గా ఉన్నాయి. 

హీరో నాని (Nani)ఓ సాలిడ్ కొట్టి చాలా కాలం అవుతుంది. శ్యామ్ సింగరాయ్ పర్వాలేదనిపించగా... టక్ జగదీష్, వి, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. భలే భలే మగాడివోయ్ తర్వాత ఆ స్థాయి హిట్ ఆయన కొట్టలేదనే చెప్పాలి. దీంతో ఓ భిన్నమైన జోనర్ లో ప్రయోగాత్మకంగా అంటే సుందరానికీ చిత్రం చేశారు. ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంగ్త్, స్లో నేరేషన్ అన్న నెగిటివ్ పాయింట్స్ వినిపించినా.. ఓవరాల్ గా సినిమాకు ప్రేక్షకులు, క్రిటిక్స్ హిట్ టాక్ కట్టబెట్టారు. అయితే టాక్ కి వస్తున్న కలెక్షన్స్ కి పొంతనలేకుండా పోయింది. 

అంటే సుందరానికీ (Aante Sundaraniki Movie collections) మూవీ... తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ స్టార్ట్ దక్కించుకుంది. ఈ చిత్ర ఫస్ట్ డే వసూళ్లు నిరాశాజనకంగా ఉన్నాయి. మధ్యాహ్నం షోస్ వరకు, అంటే సుందరానికీ కలెక్షన్స్ చాలా డల్ గా ఉన్నాయి. ఇక ఫస్ట్ షో, సెకండ్ షోస్ పుంజుకోకపోతే మొదటిరోజు నాని అంటే సుందరానికీ పూర్ ఫిగర్స్ నమోదు చేస్తుంది. అయితే వర్డ్ ఆఫ్ మౌత్ గట్టిగా జనాల్లోకి వెళితే శని, ఆదివారాలు పికప్ అయ్యే అవకాశం కలదు. 

అంటే సుందరానికీ మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అంటే సుందరానికీ మూవీ.. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 3.50 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 30 కోట్లు బిజినెస్ జరిగింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా ఉంది. 

కాబట్టి ఈ టార్గెట్ చేరుకోవాలంటే అంటే సుందరానికీ ఓపెనింగ్స్ గట్టిగా రాబట్టాలి.గత వారం విడుదలైన విక్రమ్, మేజర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అంతకు ముందు వారం విడుదలైన ఎఫ్3 సైతం థియేటర్స్ లోనే ఉంది. ఈ మూడు భారీ చిత్రాల నుండి అంటే సుందరానికీ పోటీ ఎదురవుతుంది. ముఖ్యంగా విక్రమ్ బ్లాక్ బస్టర్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ వసూళ్లు రాబడుతుంది. రూ. 7 కోట్లకు విక్రమ్ హక్కులు నితిన్ కొనగా... రూ. 11 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.