టాలీవుడ్ హీరోలు వీకెండ్ రాగానే అందరూ ఒక చోట గేదర్ అవటం, తమ ఇష్యూలు ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవటం,చర్చించుకోవటం చేస్తూంటారు. అంతేకాదు ట్రిప్ కు ఓ సారి చొప్పున...హీరోలు తమ ఇళ్లలో పార్టీలు ఏర్పాటు చేసి తమ స్నేహ భావం చాటుకుంటూంటారు. దాంతో హీరోల్లో చాలా మందిది ఒకే మాట,ఒకే బాటగా ఉంటుంది. అంతేకాదు..ఈ పార్టీల ద్వారా స్నేహ భావం పెరిగి...ఒకరికొకరు రికమెండ్ చేసుకోవటం, ఒకరి దగ్గరకు వచ్చిన ప్రాజెక్టుని మరొకరి దగ్గరకు పంపటం వంటివి చేస్తూంటారు. అదే కోవలో నాని, రవితేజ మధ్య స్నేహం కూడా ఉంది. వీళ్లుద్దరు ఖాళీ సమయాల్లో కలుస్తూంటారు. అలాగే ఒకరి దగ్గరకు వచ్చిన ప్రాజెక్టుని మరకొరకి ఫార్వర్డ్ చేస్తూంటారు. రీసెంట్ గా నాని...ఓ ప్రాజెక్టుని రవితేజ కు పంపి సెట్ చేసారని సమాచారం.

రవితేజ కెరీర్ అసలు బాగోలేదు. ఈ మధ్యనే 1980 నాటి డాన్‌గా `డిస్కోరాజా`లో న‌టించాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చనన ఆ సినిమా ఫ్లాపయింది. దాంతో ఏ సినిమా చెయ్యాలి తర్వాత అనే డైలమోలో ఉన్నాడు. ఈ క్రమంలో నాని ఓ కథ విని ..నచ్చి..రవితేజకు ఫెరఫెక్ట్ గా సెట్ అవుతుందని పంపించి,ప్రాజెక్టు సెట్ చేసారని సమాచారం. నాని కెరీర్ లో నేను లోకల్ వంటి హిట్ ఇచ్చిన నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమా కూడా పీరియాడిక్ నేపధ్యంలో నడుస్తుందిట.  నాని కోసం కథ చేసుకుని వెళ్లి చెప్తే ఇది నాకన్నా రవితేజ కు అయితే ఫెరఫెక్ట్ అని పంపారట.

ఇక ర‌వితేజ కూడా తాను చేస్తున్న సినిమాల‌కి భిన్నంగా ఉంద‌ని, వెంట‌నే ఓకే చెప్పాడ‌ట‌. క‌థ భిన్నంగా ఉన్న‌ప్ప‌టికీ… డిస్కోరాజా త‌ర‌హాలోనే పీరియాడిక్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని  చెప్తున్నారు. ఆ నేపధ్యం కూడా ర‌వితేజ‌కి బాగా న‌చ్చింద‌ట‌.అలాగే ఈ చిత్రంలో ర‌వితేజ‌ని బెల్ బాట‌మ్ ప్యాంట్ల‌లో చూడొచ్చ‌ట‌. ప్ర‌స్తుతం ర‌వితేజ `క్రాక్‌` సినిమాలో న‌టిస్తున్నాడు. ఆ త‌ర్వాత త్రినాథ‌రావు తీయ‌బోయే సినిమానే అంటున్నారు.