నాని గ్యాంగ్ లీడర్ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలిసారి వీరి కాంబినేషన్ లో చిత్రం రాబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెన్సిల్ పార్థసారధి అనే ఫన్నీ రైటర్ గా నాని ఈ చిత్రంలో నటించాడు. 

సరదాగా సాగిపోయే రివేంజ్ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినీ క్రిటిక్స్ లో ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా కూడా నానికి ఉన్న క్రేజ్ తో గ్యాంగ్ లీడర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 4.5 కోట్ల షేర్ రాబట్టింది. 

సినిమాపై పాజిటివ్ టాక్ పెరుగుతుండడంతో శనివారం కూడా అదిరిపోయే వసూళ్లు నమోదయ్యాయి. శనివారం రోజు బాక్సాఫీస్ వద్ద పట్టు నిలుపుకుంటూ 3.5 కోట్ల షేర్ రాబట్టింది. దీనితో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో గ్యాంగ్ లీడర్ చిత్ర వసూళ్లు 8 కోట్ల షేర్ కు చేరాయి. దీనితో నాని మ్యాజిక్ ఆడియన్స్ పై బాగానే పనిస్తోందని అంటున్నారు. నైజాంలో 3 కోట్లు, సీడెడ్ లో 98 లక్షలు, గుంటూరులో 72 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 76 లక్షల షేర్ ని ఈ చిత్రం సాధించింది. 

ఇక ఆదివారం రోజు శనివారం కంటే అధిక వసూళ్లు నమోదవుతాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మంచి వసూళ్లతో నడుస్తున్న ఈ చిత్రం వీకెండ్ లో సాధించే వసూళ్ళని బట్టి విజయంపై ఓ అంచనాకు వచేయెచ్చు.