Asianet News TeluguAsianet News Telugu

'దసరా' ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు, మాస్ ఓపెనింగ్స్

సుమారు 2,700 పై చిలుకు స్క్రీన్స్ లో 'దసరా' (#Dasara) సినిమా విడుదల అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900 కి పైగా థియేటర్స్ లో...

Nani Mass Swag Dasara Box office collections Day 1
Author
First Published Mar 31, 2023, 9:05 AM IST


నాని (Nani) 'దసరా' (#Dasara) సినిమా నిన్న రిలీజైంది. ఈ సినిమాకు ఓ రేంజిలో రిలీజ్ కు ముందే బజ్ రావటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. దాంతో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే కనపడుతోంది. మరో ప్రక్క నాని ఈ సినిమాకి దేశం అంతా తిరిగి ప్రచారం చేసాడు. రిలీజ్ కి ముందు జరిగే వ్యాపారం కూడా చాలా అద్భుతంగా వుంది. నిన్న అంటే మార్చి 30, శ్రీరామనవమి (Sriramanavami) పండగ నాడు అన్ని భాషల్లోని విడుదల అవ్వటానికి ఈ సినిమా విడుదలైంది. ఇందులో కీర్తి సురేష్ (Keerthy Suresh) కథానాయిక. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దీనికి దర్శకుడు.

సుమారు 2,700 పై చిలుకు స్క్రీన్స్ లో 'దసరా' (#Dasara) సినిమా విడుదల అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900 కి పైగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అయ్యింది అంటే ఇది పెద్దగా విడుదల చేసారో అర్థం అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ స్దాయిలో ఉన్నాయనేది హాట్ టాపిక్ గా మారింది. 

తెలంగాణా నేపధ్యంలో వచ్చిన ఈ చిత్రం నైజాం ఏరియాలో లిటరల్ గా కుమ్మేసిందని చెప్పాలి. 3.5 కోట్లు ఈ సినిమా నైజాం ఏరియాలో వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇది నాని గత చిత్రం కన్నా 50% ఎక్కువ. ప్రతీచోటా సెన్సేషనల్ ఓపినింగ్స్ వచ్చాయి.
  
ఇక ఆంధ్రా విషయానికి వస్తే... 

ఉత్తరాంధ్ర - 1.25 Cr 

గుంటూరు - 1.1 Cr 

ఈస్ట్ గోదావరి - 0.87 Cr 

కృష్ణా - 0.62 Cr 

వెస్ట్ గోదావరి - 0.54 Cr 

నెల్లూరు - 0.34 Cr 

మొత్తం ఆంధ్రా షేర్ - 4.72 Cr

ఇక  USA భాక్సాఫీస్ విషయానికి వస్తే..
  
ప్రీమియర్స్ : $637,677 - 391 లొకేషన్స్
మొదిటి రోజు: $73,168  
 
అన్ని చోట్లా  బ్లాక్ బస్టర్ స్టార్ట్
 

Follow Us:
Download App:
  • android
  • ios