Asianet News Telugu

నాని నన్ను నాలుగైదు సార్లు ఏడిపించాడు.. ఇలా చేస్తాడనుకోలేదు..

.జెర్సీ సినిమా తన హృదయానికి బాగా దగ్గరైన సినిమా అన్నారు. అలాగే నాని అద్బుతమైన ఫెరఫార్మ్ చేసారని, తను సినిమా చూస్తూ ఏడ్చేసానని, నాని తనను ఐదారు సార్లు ఏడిపించారని అన్నారు. 

Nani Made Me Cry 4-5 times: Shahid Kapoor JSP
Author
Hyderabad, First Published Jun 23, 2021, 8:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 తెలుగులో సూపర్‌హిట్‌ అందుకున్న ‘జెర్సీ’ని హిందీలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. మాతృకను తీసిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. గతేడాది డిసెంబరులో షూటింగ్‌ ఆరంభమైంది.  దీపావళి కానుకగా నవంబర్‌ 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.  ఈ సినిమా కోసం బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 

ఈ సినిమాలో తెలుగులో నేచురల్‌ స్టార్‌ నాని క్రికెటర్‌గా కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే. ఆ సినిమాను అదే పేరుతో బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు. అందులో షాహిద్‌కపూర్‌ క్రికెటర్‌గా నటించాడు. ఈ మేరకు షాహిద్‌కపూర్‌ సినిమా గురించి మాట్లాడారు. తన అనుభాలను అభిమానులతో పంచుకున్నాడు.

షాహిద్‌కపూర్‌ మాట్లాడుతూ...జెర్సీ సినిమా తన హృదయానికి బాగా దగ్గరైన సినిమా అన్నారు. అలాగే నాని అద్బుతమైన ఫెరఫార్మ్ చేసారని, తను సినిమా చూస్తూ ఏడ్చేసానని, నాని తనను ఐదారు సార్లు ఏడిపించారని అన్నారు. అలాగే తనకు ఇప్పుడు 40 సంవత్సరాలు అని,నన్ను నేను జెర్సీలో రిలేట్ చేసుకున్నానని అన్నారు. లేట్ సక్సెస్ గురించి చెప్పే సినిమా  తనకు బాగా కనెక్ట్ అయ్యిందని తను లేట్ సక్సెస్ అని గుర్తు చేసుకున్నారు. 

ఇక కొవిడ్ సమయంలో 47 రోజుల పాటు షూటింగ్‌ చేశాం. ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం టీమ్‌ను చూసి ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఇది ఓ అద్భుతంలా ఉంది. తమ జీవితాలకు ప్రమాదం అని తెలిసినా, రోజూ సెట్‌కు వచ్చి షూటింగ్‌ చేశారు. అందుకు వారందరికీ చాలా ధన్యవాదాలు’ అని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘కొన్ని కథలు మనసుకు చాలా హత్తుకుంటాయి. అలాంటిదే ఈ ‘జెర్సీ’. మబ్బుల్లోంచి వచ్చే సూర్యోదయం వంటిది ఈ చిత్ర కథ. మనసు దేనికీ లొంగకుండా ఆశయ సాధనలో గొప్ప విజయాన్ని సాధించేదే ఈ చిత్రం.  ’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.  

ఇక ఈ సినిమా కోసం షాహిద్‌ రూ.35 కోట్లు+పన్ను పారితోషికంగా తీసుకుంటున్నారట. అంతేకాదు సినిమాకు వచ్చే లాభంలో 20 శాతం వాటా కూడా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గత సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ఆయన పారితోషికం పెంచినట్లు సమాచారం. 

ఇప్పటికే షాహిద్‌ తెలుగు సినిమా ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌లో నటించారు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించారు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.379 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. అంతేకాదు షాహిద్‌, కియారా నటనకు సినీ ప్రముఖులతోపాటు నెటిజన్ల ప్రశంసలు లభించాయి. ‘జెర్సీ’లో నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించారు. ఇందులో నేచురల్‌ స్టార్‌ క్రికెటర్‌ పాత్రలో కనిపించి అలరించారు. మరి హిందీ రీమేక్‌ ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోనుందో చూడాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios