గత సంక్రాంతి సీజన్ నుంచి చూసుకుంటే టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా రికార్డులు ఏమి బ్రేక్ అవ్వలేదు. కానీ ఊహించని విధంగా పెట్టిన పెట్టుబడికి F2 - మజిలీ సినిమాలు మంచి లాభాలను అందించాయి. అయితే మొన్నటి వరకు రెండు సినిమాల మధ్య ఫైట్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. 

సమ్మర్ లో ఈ ఏడాది ఫస్ట్ టైమ్ రెండు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. నాని క్రికెటర్ గా కనిపించిన జెర్సీ.. అలాగే రాఘవ లారెన్స్ హారర్ కామెడీ థ్రిల్లర్ కాంచన 3 సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. గతంలో వచ్చిన లారెన్స్ కాంచన సిరీస్ లు మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నాయి. 

ఇప్పుడు కూడా  కాంచన 3 సినిమా భారీగా రిలీజ్ అవుతోంది. ఇక నాని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఎమోషనల్ స్టోరీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. హాలిడేస్ కావడంతో డిఫరెంట్ సినిమాల కోసం జనాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో ఎవరు మొదటి స్థానంలో నిలుస్తారో చూడాలి.