నేచురల్ స్టార్ నాని (Nani) వరుస చిత్రాలతో తన అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ‘దసరా’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే కీలక సన్నివేశం కోసం చిత్ర యూనిట్ భారీ సెట్ వేయించినట్టు తెలుస్తోంది.  

నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో ఆడియెన్స్ ను, అభిమానులను అలరిస్తున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’తో మంచి సక్సెస్ అందుకున్న నాని.. అదే జోష్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అండ్ కామెడీ డ్రామా ‘అంటే సుందరానికీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. కాగా ప్రస్తుతం తను నటిస్తున్న చిత్రం ‘దసరా’పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మాస్ సాలిడ్ హిట్ ఈ మూవీ సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నాని మేక్ ఓవర్, రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘దసరా’(Dasara). ఈ చిత్రంలో నాని, హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటిస్తున్నారు. గోదావరిఖని మైన్స్ బ్యాక్ డ్రాప్ లో చిత్రం తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న దసరా టీం. తాజాగా మరో షెడ్యూల్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ‘అంటే సుందారానికీ’ చిత్రం కోసం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన నాని మళ్లీ జాయిన్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం న్యూ షెడ్యూల్ హైదరాబాద్ లోనే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 

అయితే, ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లో ఎక్కువ భాగం యాక్షన్ పార్ట్ కే ప్రాధాన్యత ఉంది. నాని కూడా ఈ విషయంలో తగ్గేదే లే అంటున్నాడంట. ఇందుకోసం ప్రస్తుత షెడ్యూల్ లో చిత్ర యూనిట్ కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అందుకు కావాల్సిన ఓ భారీ సెట్ ను నిర్మించారంట. ఈ సెట్ లోనే ప్రస్తుతం అదిరిపోయే యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పటికే ఈ మూవీ సాంగ్ ను 500 మందితో అద్భుతంగా చిత్రీకరించారని టాక్ వినిపిస్తోంది. అలాగే యాక్షన్ సీన్లు ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. దీంతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది.

‘దసరా’ చిత్రాన్ని మేకర్స్ పాన్ ఇండియన్ గా రిలీజ్ చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ నుంచి వస్తున్న అన్నీ సినిమాలు దాదాపుగా పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నాని కూడా ఈసారి డేర్ స్టెప్ వేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. నాని కేరీర్ లోనే ‘దసరా’ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.