నానిపై వచ్చిన ఈ వార్తలో నిజం ఎంత? అలా చేస్తాడా
దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న నాని ఆ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. ఎప్పుడూ విభిన్న కథలతో ఆడియన్స్ ను అలరించాలని అనుకునే నాని ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

నాని (Nani) తండ్రి పాత్రలో నటిస్తోన్న ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ (Hi Nanna). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్. బేబీ కియారా ఖన్నా, శ్రుతిహాసన్ కీలకపాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 7 న రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో చిత్రం నాన్ థియేటర్ డీల్స్ రీసెంట్ గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు థియేటర్ డీల్స్ క్లోజ్ చేయాల్సి ఉంది. అయితే ఈ జానర్ ని బట్టి బయ్యర్లు ఎక్కువ రేటు పెట్టి ఈ చిత్రం రైట్స్ తీసుకోవటానికి ఆసక్తి చూపటం లేదని సమాచారం. దాంతో బాగా నెగిషియేషన్స్ జరుగుతున్నాయట.
ఇదిలా ఉంటే ఈ చిత్రం నిమిత్తం నాని 25 కోట్లు రెమ్యునరేషన్ కు మాట్లాడుకున్నారట. అయితే ఇప్పటిదాకా ఇంకా పూర్తి ఎమౌంట్ అందలేదని, రిలీజ్ లోపే సెటిల్ చేసుకోవాలని నానీ భావిస్తున్నారట. ఈ క్రమంలో నానికి సెటిల్మెంట్ క్రింద కొన్ని ఏరియాలు ఇవ్వటానికి నిర్మాత ప్రపోజల్ పెట్టారని, నాని మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే నాని ఒప్పుకుంటే కనుక....ఆ ఏరియాల బిజినెస్ నాని చూసుకుంటారని అంటున్నారు. అయితే అవి ఏరియాలు అనేది తెలియరాలేదు. అలాగే ఈ టాక్ లో ఎంతవరకూ నిజం ఉందనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ను చిత్ర టీమ్ విడుదల చేసింది. సరదాగా సాగుతోన్న తండ్రీ కుమార్తెల జీవితంలోకి ఒక యువతి ఎంట్రీ ఇవ్వడం.. అతడితో ఆమె ప్రేమలోపడటం.. వంటి సన్నివేశాలతో ఈ టీజర్‌ను తీర్చిదిద్దారు. ఆమె ప్రేమను అతడు అంగీకరించాడా? తన కుమార్తె కోసం అతడు ఏం చేశాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న నాని ఆ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. ఎప్పుడూ విభిన్న కథలతో ఆడియన్స్ ను అలరించాలని అనుకునే నాని ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మాత్రమే కాకుండా అందమైన ప్రేమ జంట మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది. నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో కాంబినేషన్ పరంగా కూడా సినిమాపై అంచనాలు పెరిగాయి.