Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ రేటుకు #HiNanna ఓటిటి రైట్స్, స్ట్రీమింగ్ డేట్

  హాయ్ నాన్న మూవీ ఓటిటి రైట్స్ షాక్ గురి చేసేలా అమ్ముడయ్యాయి. ఈ లెక్కన చూస్తే నాని మార్కెట్ ఏ రేంజ్ కి పెరిగిపోయిందో అర్థమవుతుంది.

Nani #HiNanna Digital Streaming Partner time jsp
Author
First Published Dec 8, 2023, 7:04 AM IST


ద‌స‌రాతో మాస్ రూట్ లోకి ప్రయాణం పెట్టుకున్న నాని అందుకు పూర్తి భిన్న‌మైన ఓ తండ్రీ కూతురు క‌థ‌ని ఎంచుకుని ‘హాయ్ నాన్న’ (Hi Nanna)అంటూ ఈ  శుక్రవారం పలకరించారు. కొత్త డైరక్టర్స్ ని పరిచయం  చేయడంలో ముందుండే నాని... మ‌రోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో  ప‌రిచ‌యం చేశారు. రిలీజ్ కి ముందే  నాని - మృణాల్ జోడీ, ప్రోమోలు ఆక‌ట్టుకున్నాయి. (Hi Nanna) యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంలో తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాల కొంతమందికి నచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ పై ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఓటిటీ రైట్స్ వివరాలు.

ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని #Netflix సొంతం చేసుకుంది. అలాగే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న  సమాచారం ప్రకారం “హాయ్ నాన్న” మూవీ రిపబ్లిక్ డే స్పెషల్ గా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఓటిటిలో  లో  స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే తెలుగు తో పాటు సౌత్ లోని అన్ని భాషలకు గాను కలిపి 37 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.  నాని సినిమాకు ఈ రేంజ్ లో ఓటిటి రైట్స్ రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. కుటుంబ ప్రేక్ష‌కులు అమితంగా ఇష్ట‌ప‌డే ఈ త‌ర‌హా భావోద్వేగాల‌తో  సినిమాలు ఈమ‌ధ్య కాలంలో  రాకపోవటంతో ఓటిటిలో బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే నాని మార్కెట్ ఏ రేంజ్ కి పెరిగిపోయిందో అర్థమవుతుంది.

ఇక ఈ మూవీ యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టెలివిజన్ సంస్థ జెమినీ టీవీ వారు దక్కించుకుంది. తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ గా అందరి చేత కంట తడి పెట్టిస్తుంది. తండ్రీ కూతుళ్ల పాత్ర‌లు ఆ ఇద్దరి నేప‌థ్యంలో పండే భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్‌. ప్ర‌థ‌మార్ధంలో ‘ఇక్క‌డ్నుంచి  వెళ్లిపోదాం నాన్న’  అని చిన్నారి చెప్ప‌డం, సెకండాఫ్ లో నువ్వు నిజ‌మైన అమ్మవి కాదుగా అంటూ చిన్నారి హీరోయిన్ తో చెప్ప‌డం, ‘ఎక్క‌డ త‌ప్పు చేశాను నా ప్రేమ స‌రిపోవ‌డం లేదా’ అని చిన్నారితో విరాజ్‌ చెప్పే సంద‌ర్భాలు క్లైమాక్స్  స్థాయి,ఎమోషన్స్ ని పండిస్తాయి.మేకర్స్. నాని కూడా ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నాడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios