న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ డేట్ పై ఫైనల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడానికి చాలానే ఆలోచించాడు. అసలైతే ఈ సినిమా ఆగస్ట్ 30న రావాల్సింది. అదే డేట్ కు వస్తామని సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి చెబుతూ వచ్చారు. 

కానీ సాహో ఆ డేట్ ని లాక్ చేసుకోవడంతో రెండు సినిమాలకు రిస్క్ అని మరో తేదీని సెట్ చేసుకున్నారు. నానికి కలిసొచ్చే సెప్టెంబర్ నెలలో 13వ తేదీన గ్యాంగ్ లీడర్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నాని మొదటి సినిమా అష్టాచమ్మా సెప్టెంబర్ 5న రిలీజ్ కాగా భలే భలే మగాడివోయ్ సెప్టెంబర్ 4న రిలీజ్ అయ్యింది. 

రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నానికి  మంచి మార్కెట్ ను సెట్ చేశాయి. దీంతో అదే సెంటిమెంట్ సాహో కారణంగా ఫాలో అవ్వాల్సివస్తోంది. సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్న గ్యాంగ్ లీడర్ సినిమా నానికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.