న్యాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ ట్రాక్ ఎక్కినా సంగతి తెలిసిందే. అంతకుముందు దేవదాస్ సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన నాని జెర్సీ సినిమాతో పాజిటివ్ టాక్ అందుకున్నాడు. కానీ ఆ సినిమాకు ఉహించినంతగా కలెక్షన్స్ అయితే రాలేవు.

దీంతో నాని ఆశలన్నీ గ్యాంగ్ లీడర్ పైనే పెట్టుకున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని క్రైమ్ స్టోరీ రైటర్ గా కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా ఆగస్ట్ 30న రిలీజ్ కావాల్సింది. కానీ సాహో సినిమా అదే తేదికి రానున్నట్లు చెప్పడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. కొత్త డేట్ ను త్వరలో ఎనౌన్స్ చేయనున్నారు. 

లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 15న గ్యాంగ్ లీడర్ ను రిలీజ్ చెయ్యాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ వాల్మీకి కూడా విడుదల కానుంది. ఆ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. మరి రెండు సినిమాలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందో చూడాలి.