Asianet News TeluguAsianet News Telugu

ఆ హీరోయిన్ తో సినిమా ఎప్పుడు? నానిని డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్.. ఆమెమో అలా.!

నేచురల్ స్టార్ నాని అభిమానులతో తాజాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా నాని స్టార్ హీరోయిన్ తో మళ్లీ జోడీ ఎప్పుడంటూ ప్రశ్నించారు. ఇందుకు నాని ఆసక్తికరంగా బదులిచ్చాడు. 

Nani fans demand him for film with Tollywood Star Actress again  NSK
Author
First Published Dec 5, 2023, 12:06 PM IST

నేచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  కథానాయిక. బేబీ కియారా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది. శౌర్యవ్ దర్శకత్వం వహించారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది.  పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో గ్రాండ్ గా డిసెంబర్ 7న విడుదల కాబోతోంది.  ఇంకా రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నారు. విభిన్నంగా సినిమాను ప్రచారం చేస్తూ మరింత రీచ్ పెంచుతున్నారు. ఈక్రమంలో తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా బదులిచ్చారు. ఓ అభిమాని నానిని స్టార్ హీరోయిన్, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ (Keerthy Suresh) మళ్లీ సినిమా ఎప్పుడంటూ ప్రశ్నించారు. ఆమెతో త్వరలో సినిమా చేయండి అంటూ కోరారు. 

టాలీవుడ్ లో ఇప్పటికే మంచి పెయిర్స్ ఉన్నాయి. అందులో నాని - కీర్తి సురేష్ జంట కూడా ఆకట్టుకుంది. ఆడియెన్స్ ను మెప్పించారు. ‘నేను లోకల్’, ‘దసరా’ చిత్రాలతో అలరించారు. ఈ రెండు సినిమాలు బాగానే ఆడాయి. ‘దసరా’తో మాస్ హిట్ ను సొంతం చేసుకున్నారు. కీర్తి సురేష్ తన పెర్ఫామెన్స్ తో రఫాడించింది. ఈ క్రమంలో మరోసారి ఈ కాంబోలో అభిమానులు సినిమా రావాలని ఆశిస్తున్నారు. 

అయితే, అభిమాని అడిగిన ప్రశ్నకు నాని ఇంట్రెస్టింగ్ గా బదులిచ్చారు. తాను రెడీగానే ఉన్నాని.. కీర్తి సురేష్ ఏమంటావంటూ ఆ ట్వీట్ ను ట్యాగ్ చేశారు. కీర్తి మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం కీర్తి సురేస్ తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంటోంది. ఇప్పటికే వరుణ్ ధావన్ 18వ చిత్రంలో నటిస్తుండగా.. ‘అక్క’ అనే వెబ్ సిరీస్ లోనూ రాధికా ఆప్టే తో కలిసి నటించనుంది. ఈ  క్రమంలో మళ్లీ నాని - కిర్తీ సురేష్ ను అభిమానులు వెండితెరపై చూడాలంటే కాస్తా సమయం పట్టడం ఖాయం. 

Nani fans demand him for film with Tollywood Star Actress again  NSK

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios