న్యాచురల్ స్టార్ నాని మొత్తానికి వరుస అపజయాల అనంతరం జెర్సీ సినిమాతో పాజిటివ్ హిట్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ కూడా అలాంటి సక్సెస్ లు అందుకోవడానికి అడుగులు వేస్తున్నాడు. ఇక కొత్తగా ఉంటుందని డబ్బింగ్ లు కూడా చెబుతున్నాడు. 

హాలీవుడ్ మూవీ 'ద లయన్ కింగ్' సినిమాలోని మెయిన్ లీడ్ సింబా క్యారెక్టర్ కి వాయిస్ ఇచ్చిన నాని తనకు ఇది చాలా నచ్చిన పని అని చెప్పాడు. రీసెంట్ గా సినిమాకు సంబందించిన తెలుగు ప్రమోషన్స్ లో నాని ఈగ సినిమాలో రాజమౌళి డిస్సపాయింట్ చేసిన విషయాన్నీ గుర్తు చేసుకున్నాడు. 

నాని మాట్లాడుతూ.. యానిమేషన్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఇక ఆ తరహాలో వచ్చే క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పాలంటే వెంటనే ఒప్పేసుకుంటా. అయితే గతంలో ఈగ సినిమాలో లీడ్ రోల్ నాదే అని ఈగ పాత్రకు డబ్బింగ్ చెప్పొచ్చని అనుకున్నా. కానీ ఈగకు సినిమాలో డైలాగ్స్ ఉండవని రాజమౌళి గారు చెప్పగానే డిస్సపాయింట్ అయ్యాను' అని నాని అప్పటి విషయాల్ని గుర్తు చేసుకున్నాడు.