మెగాస్టార్ ఫ్యాన్స్ నానిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇటీవల కొన్ని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అదే విధంగా ట్రోలింగ్ కూడా నడిచినట్లు న్యూస్ లు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఎట్టకేలకు నాని స్పందించాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. నాని జెర్సీ తరువాత చేస్తోన్న చిత్రం గ్యాంగ్ లీడర్. మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాపై ముందు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆ తరువాత మెగా ఫ్యాన్స్ ఈ టైటిల్ నానికి సెట్టవ్వదని ట్రోలింగ్ చేసినట్లు కథనాలు వచ్చాయి. ఇదే విషయంపై జెర్సీ ప్రమోషన్ లో నానికి ఒక ప్రశ్న ఎదురైంది.  

అయితే మెగా ఫ్యాన్స్ ఎవరు కూడా తనను ట్రోల్ చేయలేదని ఆ టైటిల్ సెట్ చేసుకున్నాక ఎవరుకూడా విమర్శించలేదని అన్నారు. అదే విధంగా గ్యాంగ్ లీడర్ సినిమా అంటే నాకు చాలా ఇష్టమని చెబుతూ.. విక్రమ్ చెప్పిన కథ ఆ విధంగా ఉండదని చెప్పారు. ఇక సినిమా కథకు కరెక్ట్ గా ఆ టైలిల్ సరిపోతుందని చెప్పిన నాని సినిమా చూసిన తరువాత ఆ విషయం ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని కూల్ గా వివరణ ఇచ్చాడు.