బిగ్ బాస్ హౌస్ లో నందమూరి హీరో?

nandamuri taraka ratna in big boss2
Highlights

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 కు మంచి రేటింగ్స్ రావడంతో ఇప్పుడు సీజన్ 2 ను 

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 కు మంచి రేటింగ్స్ రావడంతో ఇప్పుడు సీజన్ 2 ను మొదలుపెట్టనున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్న వారి లిస్టు ఇదే అంటూ 16 మంది పేర్లు బయటకు వచ్చాయి. 

అందులో హీరో తరుణ్ పేరు ఉంటే అసలు తనకు బిగ్ బాస్ షోపై ఎలాంటి ఇంటరెస్ట్ లేదని చెప్పేశాడు తరుణ్. ఇప్పుడు నందమూరి తారకరత్న ఈ షోలో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. హీరోగా సక్సెస్ లు రాకపోవడంతో మధ్యలో విలన్ గా ట్రై చేశాడు తారక రత్న. అది కూడా వర్కవుట్ కాకపోవడంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ వస్తుందనే ఆలోచనతో షోలో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. 

loader