ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైన కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’.. డేట్ కన్ఫమ్.. ఎప్పుడంటే?
నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేస్తున్నారు. తాజాగా ‘అమిగోస్’తో అలరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.
వరుస చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ‘బింబిసార’తో సాలిడ్ హిట్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ రీసెంట్ గా ‘అమిగోస్’ (Amigos) చిత్రంతో ఆకట్టుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మించారు. ఫిబ్రవరి 10న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించగలిగింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
మొత్తానికి చిత్రానికి మాత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్సే దక్కడం విశేషం. ఈ క్రమంలో ‘అమిగోస్’ను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా కన్ఫమ్ అయ్యింది. ఈచిత్రం ఓటీటీ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ యాప్ లో డేట్ ను కన్ఫమ్ చేసింది. April 1న డేట్ ఫిక్స్ చేసింది. అంటే మరో 25 రోజుల తర్వాత చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ సిద్ధంగా ఉంది. దీంతో కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఏకంగా త్రిపాత్రినభియంతో ఆకట్టుకున్నారు. మూడు పాత్రల్లో నటించడం నందమూరి వారసులకే చెందిందని కళ్యాణ్ రామ్ మరోసారి నిరూపించారు. ఇలా ప్రమోగాత్మక చిత్రాలతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హీరోయిన్ గా ఆశికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ‘డెవిల్’ చిత్రంపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. దీని తర్వాత ‘బింబిసారా 2’పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.