Asianet News TeluguAsianet News Telugu

కళ్యాణ్ రామ్ సైలెంట్ గా భలే ట్విస్ట్ ఇచ్చాడే

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్ గా అనౌన్స్ మెంట్ రావటంతో మొన్నే ప్రారంభం అయ్యిందనుకుంటున్నారు. కానీ ట్విస్ట్ ఏమిటంటే.. 

Nandamuri Kalyan Ram's next  'Bimbisara' ready release jsp
Author
Hyderabad, First Published Jul 1, 2021, 4:37 PM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ త్వరలో హిస్టారికల్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. బింబిసార అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంభందించిన పోస్టర్స్ ఇప్పటికే మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్ గా అనౌన్స్ మెంట్ రావటంతో మొన్నే ప్రారంభం అయ్యిందనుకుంటున్నారు. కానీ ట్విస్ట్ ఏమిటంటే.. అనౌన్సమెంట్ నాటికే చాలా మేర సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యినట్టు సమాచారం. 

  ఏకంగా 70 శాతం మేర షూట్ ను కళ్యాణ్ రామ్ కంప్లీట్ చేసేసినట్టు తెలుస్తుంది. దాంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతోంది. కళ్యాణ్ రామ్ ఇలా సైలెంట్ గా ట్విస్ట్ ఇచ్చారేంటి అంటున్నారు. వశిష్ట మల్లిడి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని మీడియా వర్గాల సమాచారం. ఇలా ఎన్టీఆర్ క్రేజ్ యాడ్ చేస్తే సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట దర్శక,నిర్మాతలు. మరోవైపు ఎన్టీఆర్ సైతం ఎంత బిజీగా ఉన్నా అన్న కోసం రెడీ అన్నారని వినికిడి.

  పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్ర టీమ్ మోషన్ పోస్టర్ లో చెప్పింది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా ఇతరభాషల్లోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios