సారాంశం
కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా షాక్ ఇచ్చింది. సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రమోషన్ లేకుండానే కామ్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కేసింది. రిలీజ్ అయిన అతి తక్కువ టైమ్ లో ఓటీటీకి చేరిన సినిమా ఇదేనేమో..
రిలీజ్ అయ్యినెల రోజులు కూడా కాలేదు.. గట్టిగా చెప్పాలంటే.. 15 రోజులు కూడా అవ్వలేదు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది కల్యాణ్ రామ్ డెవిల్ సినిమా. అందరికి షాక్ ఇచ్చింది. కామ్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కేసింది. టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్‌రామ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈసినిమాను అభిషేక్ నామా డైరెక్ట్ చేశారు. డెవిల్ ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే క్యాప్షన్ తో రూపొందిందిమూవీ.
డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈమూవీలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ గెటప్ లోకనిపించాడు. థియేటర్ రన్ లోఈమూవీ 35 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక థియేటర్‌లో అలరించిన ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం కాలం నాటి కథగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ చిత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఓటిటి రైట్స్ అమ్మకం జరిగింది. ఈ నేపధ్యంలో .. అయితే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ తరువాత మేకర్స్ ఈ విషయం వెల్లడించడం జరిగింది.
ఇక ఈసినిమా ఓటిటి లో నెల పదిహేను రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి రెండువ వారంలో రిలీజ్ అవుతుంది అని ముందుగా అనుకున్నారు. కాని అనుకున్న టైమ్ కు చాలా ముందుగానే అమెజాన్ లో సందడి చేస్తోంది. ఇక ఈమూవీ శాటిలైట్ హక్కులు ఈటీవి దక్కించుకున్నట్టు తెలుస్తోంది.