మార్నింగ్ షో నుంచేె   పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఓటిటి రైట్స్ అమ్మకం జరిగింది. ఈ నేపధ్యంలో  చిత్రం ఏ ఓటిటిలో రానుంది. ఎప్పటి నుంచి అనేది చూద్దాం. 

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా తొలుత నిర్మాణ సారధ్యం వహించి.. అనంతరం దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించి రూపొందించిన చిత్రం “డెవిల్”. కళ్యాణ్ రామ్ ఓ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం కాలం నాటి కథగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ చిత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని (డిసెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఓటిటి రైట్స్ అమ్మకం జరిగింది. ఈ నేపధ్యంలో చిత్రం ఏ ఓటిటిలో రానుంది. ఎప్పటి నుంచి అనేది చూద్దాం. 

అమెజాన్ ప్రైమ్ వీడియో డెవిల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సంపాదించింది. ఇక ఈ చిత్రం ఓటిటి లో నెల పదిహేను రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి రెండువ వారంలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రం శాటిలైట్ హక్కులను మంచి ధరకే ఈటీవీ దక్కించుకున్నట్లు తెలిసింది.

కథేమిటంటే...

కథా నేఫధ్య కాలం 1945. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు గ్రామం. అక్కడ జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. పాలేరు మాయం అవుతారు. అయితే కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. అసలు ఎవరు ఈ హత్య చేసారు. అందుకు కారణం ఏమిటి అనే ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) ని ప్రభుత్వం పంపుతుంది. అక్కడికి వెళ్లిన డెవిల్ కు ఈ కేసులో జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్)పై అనుమానం. ఆమెను ఇన్విస్టిగేట్ చేసే క్రమంలో ఆమెతో ప్రేమలో పడతాడు. ఇదిలా జరుగుతూండగానే “Operation Tiger Hunt.”అనే కొత్త మిషన్ ని డెవిల్ కు అప్పచెప్తుంది ప్రభుత్వం..అదేమిటీ అంటే...

ఆ స్వతంత్ర ఉద్యమరోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే బ్రిటీష్ ప్రభుత్వానికి భయం. తమకు పెద్ద అడ్డంకిగా తయారైన ఆయన్ను పట్టుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వం నానా రకాలుగా ట్రై చేస్తుంది. ఈలోగా ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) చీఫ్ నేతాజి సుభాష్ చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్టు, ఆ మిషన్‌ను బాధ్యతను త్రివర్ణకు అప్పగించినట్టు బ్రిటిష్ ప్రభుత్వానికి (కోడ్) సమాచారం అందుతుంది. ఆ కోడ్‌ను డీకోడ్ చేసే బాధ్యతను డెవిల్‌కు అప్పగిస్తారు. అప్పుడే డెవిల్ కు సంభందించిన ఓ షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి... ఓ ప్రక్క మర్డర్ కేసు...మరో ప్రక్క సుభాష్ చంద్రబోస్ పట్టుకునేందుకు ప్రయత్నాలు ఈ రెండు డెవిల్ సమర్దవంతంగా చేయగలిగాడా..అసలు మర్డర్ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఇంతకీ త్రివర్ణ ఎవరు? మణిమేఖల (మాళవిక నాయర్) పాత్ర ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.