విచిత్ర తమిళంలో కాకుండా వేరే భాషలో నటించిన ఏకైక చిత్రం తెలుగులోనే. అది కూడా బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భలేవాడివి బాసూ’ (Bhalevadivi Basu).


గత మూడు రోజులుగా బాలకృష్ణకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ నటి విచిత్ర ఓ ప్రముఖ తెలుగు హీరో తనని వేధించాడని చెప్పి సంచలనం సృష్టించింది. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఓ తెలుగు సినిమాలో నటించానని..ఆ సినిమాలోని హీరో తనని వేధించినట్లు విచిత్ర చెప్పుకొచ్చింది.సినిమా షూటింగ్‌లో భాగంగా తాము కేరళ వెళ్లగా..అక్కడ హీరోతో తనకి పరిచియం అయిందని..తాను ఎవరో కూడా తెలియకుండానే రాత్రి నా రూమ్‌కి వచ్చేయ్ అన్నాడని ఆమె తెలిపింది. 

కాని నేను అలా చేయలేదని...దీంతో షూటింగ్ సమయంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టారని..ఆ హీరో రోజూ తాగొచ్చి నా రూమ్ డోర్ కొట్టేవాడని.. నేను భయపడిపోయే దాన్ని అని నటి విచిత్ర వెల్లడించింది. అయితే ఆమె ఆరోపణలు చేసింది టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ మీదనే అని జనం కామెంట్ చేస్తున్నారు. విచిత్ర తమిళంలో కాకుండా వేరే భాషలో నటించిన ఏకైక చిత్రం తెలుగులోనే. అది కూడా బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భలేవాడివి బాసూ’ (Bhalevadivi Basu). ఈ సినిమాలో శిల్పాషెట్టి, అంజల ఝవేరీ హీరోయిన్‌లుగా న‌టించ‌గా న‌టి విచిత్ర గిరిజన యువతి పాత్రలో కనిపించింది. ఆ సినిమా 2001లో వచ్చింది.. దీంతో నటి విచిత్ర చెప్పింది బాలయ్య గురించే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక ఈ విషయమై అందరూ బాలయ్యపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో నందమూరి చైతన్య కృష్ణ రియాక్ట్ అయ్యారు.   బాలయ్య మీదే విచిత్ర ఆరోపణలు చేసిందని స్పష్టమయ్యేలా ఆయన మాట్లాడారు. అయితే  ఆమె చేసిన కామెంట్లను చైతన్య కృష్ణ తోసిపుచ్చాడు.ఆయన అలా వల్గర్‌గా ప్రవర్తించరు.. బాబాయ్‌ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు.. హ్యాట్రిక్ హిట్ వచ్చింది కదా? అందుకే ఇలా ఆరోపణలు చేసి డౌన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఏ హీరో కూడా అలా ప్రవర్తించరు.. ఏదో డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే.. ఫీల్ అవుతారు.. అలాంటివి ఉంటాయోమే కానీ ఇలాంటివి ఉండవు అంటూ చైతన్య కృష్ణ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.