Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే పాత్రలో బాలయ్య ?.. NBK 109 గురించి క్రేజీ డీటెయిల్స్

నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల హ్యాట్రిక్ సక్సెస్ ని ఇకపై కూడా కొనసాగించాలని భావిస్తున్నారు. బాలకృష్ణ తన బాడీ లాంగ్వేజ్ కి సరిపడే పాత్రకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

Nandamuri Balakrishna to play MLA in NBK 109 dtr
Author
First Published Apr 11, 2024, 11:14 AM IST

నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల హ్యాట్రిక్ సక్సెస్ ని ఇకపై కూడా కొనసాగించాలని భావిస్తున్నారు. బాలకృష్ణ తన బాడీ లాంగ్వేజ్ కి సరిపడే పాత్రకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అది బాగా వర్కౌట్ అవుతోంది. ప్రస్తుతం ఎలక్షన్ హీట్ నడుస్తుండడంతో బాలయ్య రాజకీయ కార్యక్రామాలతో కూడా బిజీగా ఉన్నారు. 

బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం ఎన్బీకే 109 బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఆ మధ్యన విడుదలైన గ్లింప్స్ అదరగొట్టింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన లీకులు అంచనాలు పెంచేస్తున్నాయి.  

బాలయ్య సినిమా అంటే కాస్తైనా పొలిటికల్ టచ్ ఉంటుంది. బోయాపాటి బాలయ్య చిత్రాల్లో పొలిటికల్ డైలాగులు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనవసరం లేదు. డైరెక్టర్ బాబీ తాను కూడా తక్కువేం కాదు అంటున్నాడు. ఈ చిత్రంలో బాలయ్యని పొలిటీషియన్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారట. 

ఒక పాత్రలో ఆయన పవర్ ఫుల్ ఎమ్మెల్యే గా కనిపిస్తాడని అంటున్నారు. ఆల్రెడీ బాలయ్య రియల్ లైఫ్ లో హిందూ పురం ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి బాలయ్య హిందూ పురం నుంచి గెలిస్తే హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. ఇటుబాలయ్య 109వ చిత్రం... అటు హిందూ పురం నుంచి బాలయ్య పోటీ చేయడం రెండు ఫ్యాన్స్ లో ఉత్కంఠని పెంచేస్తున్నాయి. 

ఈ చిత్రాన్ని ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios