అక్కినేని శతజయంతి ఈవెంట్ లో కనిపించని బాలయ్య.. మరోసారి అదే రిపీట్..
తెలుగు నటనా శిఖరం అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి నేటి నుంచి మొదలైంది. దీనితో ఏఎన్నార్ తనయుడు, కింగ్ నాగార్జున తన తండ్రి శతజయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

తెలుగు నటనా శిఖరం అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి నేటి నుంచి మొదలైంది. దీనితో ఏఎన్నార్ తనయుడు, కింగ్ నాగార్జున తన తండ్రి శతజయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ విగ్రహావిష్కరణతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది.
సినీ రాజకీయ ప్రముఖుల నడుమ జరిగిన ఈ ఈవెంట్ కి టాలీవుడ్ లో అన్ని ఫ్యామిలీల నుంచి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కానీ నందమూరి ఫ్యామిలీ మాత్రం ఈ ఈవెంట్ లో కనిపించలేదు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అక్కినేని విగ్రహావిష్కరణకు హాజరు కాలేదు. దీనికి కారణంగా ఎప్పుడూ వినిపించే మాటలే తెరపైకి వస్తున్నాయి.
బాలయ్య అక్కినేని విగ్రహావిష్కరణకు హాజరు కాకపోవడానికి కారణం నాగార్జునతో ఉన్న విభేదాలే అంటూ ప్రచారం జరుగుతోంది. గడచిన కొన్నేళ్లలో బాలయ్య, నాగార్జున ఎక్కడా ఎప్పుడూ కలసి మాట్లాడుకుంది లేదు. వీరిద్దరి మధ్య ఇంత వైరం ఎందుకు వచ్చింది.. ఎక్కడ చెడింది అనే అంశంపై ఎవరికీ క్లారిటీ లేదు.
ఇటీవల వీరసింహారెడ్డి ఈవెంట్ లో బాలయ్య అక్కినేని తొక్కినేని అని కామెంట్ చేయడం కూడా పెద్ద వివాదమే అయింది. చాలా రోజుల నుంచి బాలయ్య నిర్వహించే ఈవెంట్స్ కి నాగార్జున వెళ్లడం... నాగార్జున నిర్వహించే ఈవెంట్స్ కి బాలయ్య హాజరు కావడం జరగడం లేదు. ఇప్పుడు బాలయ్య గైర్హాజరుతో అదే రిపీట్ అయింది అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
ఇక మెగా ఫ్యామిలీ నుంచి రాంచరణ్ అక్కినేని విగ్రహావిష్కరణకు అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి సోషల్ మీడియాలో ఏఎన్నార్ శతజయంతిని పురస్కరించుకుని అందమైన పోస్ట్ చేశారు. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను అంటూ చిరంజీవి పోస్ట్ చేయడం విశేషం.