ఈ సినిమా విజయవంతంగా 100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ఫంక్షన్‌కు బాలయ్య అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా 100 రోజుల సందర్భంగా స్పెషల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.


కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదలై..ప్రేక్షకులకు పూనకాలు... థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన చిత్రం ‘అఖండ’. రిలీజైనన మొదటి రోజు నుంచే విశేష ప్రేక్షకాదరణ పొందుతూ ఇతర పెద్ద చిత్రాల విడుదలకు భరోసానిచ్చింది. ఈ సినిమా పది రోజుల్లో రూ. 100 కోట్లు (గ్రాస్‌ వసూళ్లు) కలెక్ట్‌ చేసి రికార్డ్ నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి స్పెషల్‌ షోలు లేకుండా, పరిమిత టికెట్‌ ధరలకే ఇన్ని కోట్ల వసూళ్లు సాధించడం విశేషమని సినీ విశ్లేషకులు అన్నారు.

తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ ‘అఖండ’ హవా కొనసాగింది. రూ.100 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరటం ద్వారా బాలకృష్ణ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన కెరీర్‌లో తొలిసారి రూ. 100కోట్లు సాధించిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా STBC గ్రౌండ్స్ కర్నూలు‌లో ఈ సినిమా కృతజ్ఞత సభ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు హీరో బాలయ్యతో పాటు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, పూర్ణ, శ్రీకాంత్ తదితరులు విచ్చేసారు.

ఈ సినిమా విజయవంతంగా 100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ఫంక్షన్‌కు బాలయ్య అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా 100 రోజుల సందర్భంగా స్పెషల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.

YouTube video player

 బాలకృష్ణ- బోయపాటి శ్రీనుల హ్యాట్రిక్‌ చిత్రమిది. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్స్. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.