ముమ్మట్టి సూపర్ హిట్ స్టోరీ లైన్ తోనే.. 'భగవంత్ కేసరి' ??
బాలకృష్ణ ఈ దసరాకి 'భగవంత్ కేసరి' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైన్డ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ఐ డోంట్ కేర్' అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్.
నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్‌లో అనీల్ రావిపుడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీ లీల నటిస్తున్నారు. దసరా కానుకగా రిలీజ్ ఉంటుందని ట్రేడ్ లో వినపడుతోంది. కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీ లీల బాలయ్య కూతురిగా నటిస్తుందని సమాచారం. ఈ సినిమా కథ గురించి రకరకాల టాపిక్స్ వినపడుతున్నాయి.
అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమాలో బాలయ్య కుమార్తె గా శ్రీ లీల కనపించనుంది. అయితే ఆమెకు తన తండ్రే బాలయ్య అని తెలియదు. బాలయ్య జైలు నుంచి బయిటకు వచ్చి తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కాకపోతే ఇక్కడో ట్విస్ట్ ... విలన్ దగ్గర తన కూతురు కూడా పెరుగుతోంది. అతను కూతుళ్లలో ఎవరు తన కూతురో తెలియదు. విలన్ కు థ్రెట్ ఉంటుంది. ఇప్పుడు అతని ఫ్యామిలీ అంతటినీ హీరో రక్షించాల్సిన వింత సిట్యువేషన్.
ఎందుకంటే తన కూతురు ఎవరో తెలిసేదాకా తప్పదు. దాదాపు ఇలాంటి కథతోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. గతంలో ఇలాంటి కథలో ముమ్మట్టి నటించిన కంకణం అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రం తెలుగులో మోహన్ బాబుతో ఖైదీ గారు పేరుతో రీమేక్ చేయబడింది .దాదాపు అది ఇలాంటి కథే అంటున్నారు. మరో ప్రక్క బాలీవుడ్‌లో 1992 లో వచ్చిన ఖుదా గవా సినిమాకు భగవంత్ కేసరికి దగ్గర పోలికలు ఉన్నట్టుగా సినీవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 20న దసరా కానుకగా విడుదల కాబోతోంది. అదే సమయంలో బాలయ్య సినిమాతో పాటు తమిళ హీరో విజయ్ 'లియో', మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ రెండు సినిమాలతో పోటీపడి 'భగవంత్ కేసరి' ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.