సినీ తారల దృష్టి సహజమైన పంటలపైకి మళ్ళింది. సహజంగా పండే కూరగాయలకు, నిత్యావసరాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. సమంత తన ఇంట్లోనే ఆర్గానిక్‌ ఫామింగ్‌లో కూరగాయలు పండించి వాహ్‌ అనిపించింది. ఇప్పుడు ఆమె బాటలోనే మహేష్‌ బాబు ఫ్యామిలీ నడుస్తున్నారు. నమ్రత తమ పొలంలో పెంచుకున్న కూరగాయల తోటని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 

ఇందులో వరి, టమాటోలు, మిరప, కాటన్‌ వంటివి ఉన్నాయి. ఈ వెజ్జీ ఫామ్‌ని వీడియో తీసి సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది నమ్రత. దీనికి ఆమె అభిమానులతోపాటు, మహేష్‌ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. నిత్యావసర వినియోగం కోసం ఈ విధంగా తన సొంత పంటని పండించటం ఆమెకి ఎంతో ఇష్టమట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇలా సొంతంగా ఫామింగ్‌ ఎంకరేజ్‌ చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

నమ్రత పెళ్ళి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె మహేష్‌బాబుకి సంబంధించిన కాల్‌షీట్లు, యాడ్స్ , మహేష్‌ రెమ్యూనరేషన్‌ వంటివి చూసుకుంటుంది. తెరవెనుక అన్నీ నమ్రతనే చూసుకుంటుంది.