కూతురు సితార తన పుట్టిన రోజున చేసిన పనికి తల్లి నమ్రత శిరోద్కర్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. ఇది వైరల్‌ అవుతుంది.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూతురు సితార ఘట్టమనేని చిన్నప్పుడే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అరుదైన ఘనతలు సాధిస్తుంది. ఓ స్టార్‌ డాటర్‌గా ఆమె అరుదైన ఘనతలు అఛీవ్‌ చేసింది. ఆ మధ్య ఓ జ్యూవెల్లరీ సంస్థకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసింది. అంతేకాదు తన పేరుతోనే ఆ కంపెనీ బ్రాండ్‌ తీసుకురావడం విశేషం. మరోవైపు ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ లోని టైమ్‌ స్వ్కైర్‌లో ఆమె యాడ్‌ ప్రదర్శించారు. ఇంత చిన్న వయసులో దానిపై ప్రదర్శించబడం విశేషంగా చెప్పొచ్చు. 

అంతేకాదు ఇటీవల సితార తన బర్త్ డేనిజరుపుకుంది. అందులో భాగంగా కొంత మందిపేద విద్యార్థినీలకు సహాయం చేసింది. మహేష్‌బాబు స్వగ్రామమైన బుర్రిపాలెం జడ్పీ హై స్కూల్‌లో చదువుతున్న 40 మంది బాలికలకు ఏంబీ ఫౌండేషన్‌ ద్వారా సైకిళ్లు అంద చేసింది. ఆ విద్యార్థినీల సమక్షంలో తన బర్త్ డే చేసుకోవడం విశేషం. తాజాగాఈ ఫోటోని పంచుకుంది తల్లి నమ్రత ఎమోషనల్‌ అయ్యింది. 

స్కూల్‌ ముందు బాలికలంతా తమ సైకిళ్లతో నిలబడి ఉన్న ఫోటోని పంచుకుంటూ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె చెబుతూ, ఈ నాలభై మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. మీరంతా స్కూల్‌కి సైకిల్‌పై వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన చదువుని ఆనందంగా నేర్చుకోవడానికి ఇలాంటి అవసరం. మీ కళ్లల్లో సంతోషం తీసుకొచ్చిన సితారకి, మహేష్‌బాబుఫౌండేషన్‌కి ధన్యవాదాలు` అని పేర్కొంది నమ్రత. కూతురుని చూసి ఆమె గర్వంగా ఫీలవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. దీనిపై అభిమానులు స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

View post on Instagram

మహేష్‌బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షెడ్యూల్‌ పూర్తయ్యింది. మరో షెడ్యూల్‌కి కొంత టైమ్‌ పడుతున్న నేపథ్యంలో ఈ గ్యాప్‌లో రిలాక్స్ అయ్యేందుకు ఫారెన్‌ వెళ్లారు మహేష్‌బాబు. తన ఫ్యామిలీ అందరితో కలిసి షార్ట్ వెకేషన్‌కి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్ లో వారి ఫోటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక `గుంటూరు కారం` సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. పూజా హెగ్డే తప్పుకుంది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నట్టు సమాచారం.