సూపర్ స్టార్ మహేష్ బాబు నటించే సినిమాల విషయంలో ఆయన సతీమణి నమ్రత హ్యాండ్ ఉంటుంది. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకురావడం దానికి తగ్గట్లుగా పబ్లిసిటీ కార్యక్రమాలు చేపట్టడం వంటివి చేస్తుంటారు.

అయితే ఈసారి 'మహర్షి' సినిమా విషయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి నమ్రతకు అంత సీన్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో సినిమాపై సరైన బజ్ క్రియేట్ అవ్వడం లేదని అభిమానులు చెబుతున్నా.. నమ్రత ఏమీ చేయలేకపోతుందట. వంశీ పైడిపల్లి ఎవరి మాట వినకపోవడంతో ఆయన్ని ఎవరూ కదపడం లేదట.

దిల్ రాజు కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం. సినిమా కంటెంట్, సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది పోస్ట్ చేయాలి..? ఇలా అన్ని విషయాల్లో వంశీ పైడిపల్లి కంట్రోల్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్, బడ్జెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న నమ్రత ఇప్పుడు పబ్లిసిటీ విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సినిమా రిలీజ్ కి మరో రెండు వారాలు మాత్రమే ఉండడం.. ఇప్పటివరకు పబ్లిసిటీ ప్లానింగ్ చేయకపోవడం నమ్రతని అసహనానికి గురి చేస్తోందట. మరేం జరుగుతుందో చూడాలి!