Asianet News TeluguAsianet News Telugu

నాగ్ ఆలోచిస్తూంటే.. నమిత అడుగేసేసింది

 నాగ్ కన్నా ఓ అడుగు ముందే ఉంది.  ఆమె డిజిటల్ స్ట్రీమింగ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. “నమిత థియేటర్” పేరుతో ఆమె ఓటిటి ని లాంచ్ చేసింది. ఈ వేదిక ద్వారా కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తానని చెప్తోంది. షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిత్రాలు ఈఓటిటిలో స్ట్రీమ్ చేస్తారట.  

Namitha Started a own OTT jsp
Author
Hyderabad, First Published May 8, 2021, 2:30 PM IST

కరోనా తో బాగా కలిసొచ్చిన వ్యాపారం ఏమిటి అంటే..ఓటిటి. ఇద్దరు సినిమా వాళ్లు కలిస్తే కరోనా కబుర్లు లేదా ఓటీటి మాటలు. ఓ మాదరి వాళ్లు ఓటీటిలో తమ సినిమా లేదా వెబ్ సీరిస్ చేద్దామని ప్లాన్ చేస్తుంటే...నిర్మాతలు సొంత ఓటిటి పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.  తన దగ్గర ఉన్న కంటెంట్ తో అరచేతిలో వినోద ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి ఓటీటీ సంస్థలు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ గా అల్లు అరవింద్ 'ఆహా'ను తీసుకొచ్చారు.అతి తక్కువ కాలంలోనే 'ఆహా' పుంజుకుంది. సినిమాలు .. వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా, కొత్త ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటోంది.

ఇవన్నీ గమనిస్తున్న నాగ్ ఒక సొంత ఓటీటీని ఏర్పాటు చేయడం కోసం, తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. నాగ్ తలచుకుంటే ఆయనకి ఇది పెద్ద విషయం కాదు .  దీని గురించి అఫీషియల్ గా ఎలాంటి సమాచారం రానప్పటికీ, ప్రస్త్తుతం దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని టాక్.అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా స్కూల్​లోని వాళ్లకు ఈ ఓటీటీ ద్వారా అవకాశాలు ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నారట. రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూలో డిజిటల్​ కంటెంట్​ గురించి ఈయన మాట్లాడారు. ఎంటర్​టైన్​మెంట్​ ఇండస్ట్రీలో తర్వాతి కాలంలో ఓటీటీదే హవా అని అన్నారు. 

ఇక ఇప్పుడు నమిత కూడా అదే ప్లానింగ్ లో ఉంది. అయితే నాగ్ కన్నా ఓ అడుగు ముందే ఉంది.  ఆమె డిజిటల్ స్ట్రీమింగ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. “నమిత థియేటర్” పేరుతో ఆమె ఓటిటి ని లాంచ్ చేసింది. ఈ వేదిక ద్వారా కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తానని చెప్తోంది. షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిత్రాలు ఈఓటిటిలో స్ట్రీమ్ చేస్తారట.  ముఖ్యంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో తీసే కంటెంట్ పైనే మెయిన్ ఫోకస్ పెడతానని చెప్తోంది. నమిత కనక సక్సెస్ అయితే ఇంకెంత మంది ఉత్సాహం చూపెడతారో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios