ఒకప్పుడు అగ్రహీరోల సరసన నటించి టాలీవుడ్ ని షేక్ చేసిన నటి నగ్మా.. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయిపోయింది.ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు నదియా, మీనా, రమ్యకృష్ణ వంటి వారు తల్లి పాత్రల్లో నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు నగ్మా కూడా ఈ లిస్ట్ లోకి చేరబోతుంది. గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నగ్మా ఇప్పుడు స్టార్ హీరోకి తల్లిగా నటించడానికి సిద్ధమవుతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బన్నీకి తల్లిగా నగ్మాని తీసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

దానికి ఆమె కూడా సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి తెరపై నగ్మా పాత్రను ఎంత పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడో.. తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!