మరోసారి వేంకటేశ్వరుడి భక్తుడిగా నాగార్జున ఈ చిత్రంలో అలరించనున్నారు. సౌరభ్ జైన్ వేంకటేశ్వరుని పాత్రలో ఒదిగిపోయారు.
అన్నమయ్య చిత్రంతో భక్తిరస చిత్రాలకు రాఘవేంద్రరావు, నాగార్జున హిట్ పెయిర్ గా నిలిచారు. మరోసారి ఈ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ఓం నమో వేంకటేశాయ.
దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. మరోసారి వేంకటేశ్వరుడి భక్తుడిగా నాగార్జున ఇందులో అలరించనున్నారు. సౌరభ్ జైన్ వేంకటేశ్వరుని పాత్రలో ఒదిగిపోయారు.
సినిమాను ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేయనున్నట్లు టాలీవుడ్ టాక్.
టీజర్ చూస్తుంటే అన్నమయ్య స్థాయిలో మరోసారి సూపర్ హిట్ టాక్ తెచ్చుకునేలా ఉందని అభిమానులు అనుకుంటున్నారు.
