కరోనా దెబ్బతో బిగ్ బాస్  షో జరుగుతుందా? లేదా? అనే డౌట్స్ సగటు టీవి ప్రేక్షకులకు కలిగాయి. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఎట్టకేలకు స్టార్ మా ప్రోమో వదిలింది.కరోనా వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్భందీగా బిగ్ బాస్ షో నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమోను విడుదల చేశారు. సోషల్ మీడియాలో  ఈప్రోమో బాగా క్లిక్ అయ్యింది. 

ఇక ప్రోమోలో నాగార్జున గెటప్ డిఫరెంట్ గా ఉంది. ముసలి వయసులో ఉన్నట్లు కనిపిస్తూ టెలిస్కోప్ తో దొంగ చూపులు చూసేస్తున్నడు. మధ్య మధ్యలో ముసి ముసిగా నవ్వుకుంటూ.. గోపి అనేశారు. అంటే గోపి గోడ మీద పిల్లి. అంటే తాను అటూ ఇటూ కాకుండా గోపీలా ఉంటూ అనేలా హౌజ్ లో జరుగే గొడవలు గేమ్ లు చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటా అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆమె క్యాప్షన్ తోనే షోకి మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక నాగ్ ..ముసలి గెటప్ లుక్ వైరల్ అవుతోంది. ఈ లుక్ చూసిన చాలా మంది..సినిమాల్లో కూడా ఈ గెటప్ తో కనపడచ్చు కదా అంటున్నారు. మరికొంతమంది...ముసలి మన్మధుడు అని కామెడీ చేస్తున్నారు. ముసలోడు రసికుడే అని కన్ను గీటుతున్నారు వేరొకరు. ఇలా మొత్తానికి నాగ్ ..హాట్ టాపిక్ గా మారారు. 

ఇక  షోలో మొత్తం 16 మంది పాల్గొననుండగా..మరోసారి హోస్ట్ గా నాగార్జునే వ్యవహరించబోతున్నారు. అదే విధంగా 106 రోజుల పాటు జరగనుంది.ఇక ఈ ప్రోమోలో నాగార్జున వృద్ధుడి గెటప్ లో టెలిస్కోప్ లో బిగ్ బాస్ హౌస్ లో ఎం జరుగుతుందో చూస్తున్నట్టు కనిపించరు.

ఇక ఈ ప్రోమోతో బిగ్ బాస్ 4 పై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. బిగ్ బాస్4  షూటింగ్‌ను ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున స్టార్ట్ చేసి.. 30 నుంచి రెగ్యులర్‌గా ఈ షోను ప్రసారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు స్టార్ మా నిర్వాహకులు.