Asianet News TeluguAsianet News Telugu

`వైల్డ్ డాగ్` టీజర్ డేట్ ఫిక్స్!

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’కు పనిచేసిన డేవిడ్ ఇస్మాలోన్ ‘వైల్డ్ డాగ్’కు యాక్షన్ డైరెక్టరుగా పనిచేస్తుండటం విశేషం.అంటే, తెలుగు తెరపై ఇంతదాకా మనం చూడని యాక్షన్ సన్నివేశాల్ని ఈ సినిమాలో చూడబోతున్నామని చెప్పొచ్చు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీకి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. 

Nagarjuna wild dog teaser on this date
Author
Hyderabad, First Published Aug 7, 2020, 8:44 AM IST

పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఫిలింగా తయారవుతున్న ‘వైల్డ్ డాగ్’ పై నాగార్జున అభిమానులకు మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కరోనా వల్ల వెనక బడటంతో కాస్తంత నిరాశకు లోనైన మాట వాస్తవం. అయితే వారికి ఆనందం కలిగించే వార్త ఇది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని ఆగస్ట్ 29 అంటే నాగార్జున పుట్టిన రోజున బర్తడే స్పెషల్ గా అందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఒక్కసారి నాగార్జున ...బిగ్ బాస్ షో షూట్ పూర్తవగానే వైల్డ్ డాగ్ పనిలో పడతారని తెలుస్తోంది. యథార్థ ఘటనల స్ఫూర్తితో రాసిన కథతో అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో ఎన్.ఐ.ఏ. ఆఫీసరుగా నాగార్జున నటిస్తున్నారు. 

ఆ మధ్యన రకుల్ ప్రీతి సింగ్ తో చేసిన ‘మన్మథుడు 2’ తో నాగార్జున వెనకబడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’ పైనే ఆయన దృష్టి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.  కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.   నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు.  కరోనా వైరస్  ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది.  ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను వాయిదా వేసింది. 
 
26/11 ముంబై దాడుల నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. కేవలం రీరికార్డింగ్ కోసమే సంగీత దర్శకుడుని తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో ప్రత్యేకమైన కామెడీ కానీ, హీరోయిన్ కానీ ఉండదు. ఓ హాలీవుడ్ చిత్రంలాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించలేదు. అలాగే పాటలు ఉండవు కాబట్టి రీరికార్డింగ్ బాగా ఇచ్చే వారిని సంగీత దర్శకుడుగా తీసుకోబోతోన్నట్లు సమాచారం.

 `గగనం` తర్వాత నాగార్జున ఇలాంటి ప్రయోగం తరహా పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ , తక్కువ వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసి అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: షానీ డియోల్‌. 
 

Follow Us:
Download App:
  • android
  • ios