పైరసీ అనేది సినిమావాళ్లకు గుండెళ్లో రైళ్లు పరుగెత్తించే వార్త. తమ సినిమా పైరసీ అయ్యిందని వార్త రాకూడదని వెయ్యి దేముళ్లలకు మ్రొక్కుకుంటారు. అయితే ఒక్కోసారి ఇంటి దొంగల వల్లో, మరొకరి వల్లో రిలీజ్ కు ముందే పైరసీ ప్రింట్ బయిటకు వచ్చేసి కలకలం రేపుతూంటుంటుంది. ఈ రోజు అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం "వైల్డ్‌ డాగ్‌". ఈ చిత్రం రిలీజ్ కు ముందే పైరసీ అయ్యిందని , ‘వైల్డ్ డాగ్’ పైరసీ ప్రింట్‌ను ఇంటర్నెట్లో పెట్టేసారని నిర్మాణ సంస్ద అఫీషియల్ గా ప్రకటించింది. మరో ప్రక్క పైరసీ సినిమాలను అప్‌లోడ్ చేసే వెబ్ సైట్లో ‘వైల్డ్ డాగ్’ లింక్ ఉన్న స్క్రీన్ షాట్ ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. అసలేం జరిగింది

ఇంకొన్ని గంటల్లో  ‘వైల్డ్ డాగ్’కు యుఎస్‌లో ప్రిమియర్స్ , ఇండియాలో సినిమా రిలీజ్ కాబోతున్న సమయంలో ఓ వార్త అభిమనులను కంగారు పెట్టింది. సినిమా రిజల్ట్ కోసం ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇంకా థియేటర్లలో రిలీజే కాని సినిమాను పైరసీ చేసారని. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్ద కూడా సినిమా లీక్‌ అయిందంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఎవరో తమ యూట్యూబ్‌ ఛానల్‌ను హ్యాక్‌ చేసి, వైల్డ్‌ డాగ్‌ ఫుల్‌ మూవీని అప్‌లోడ్‌ చేశారని ట్వీట్‌ చేసింది.  

ఎవరో తమ యూట్యూబ్ చానల్లో 'వైల్డ్ డాగ్' చిత్రం మొత్తాన్ని అప్ లోడ్ చేశారని, అయితే యూట్యూబ్ లో ఎవరూ చూడొద్దని విజ్ఞప్తి చేసింది. రేపు థియేటర్లలోనే చూడాలని సూచించింది. అంతేకాదు, తమ యూట్యూబ్ చానల్ లింకును కూడా పంచుకుంది.అయితే కాసేపటికే అది ఫేక్ న్యూస్ అని తేలింది. . ‘వైల్డ్ డాగ్’ చిత్రాన్ని వైల్డ్ గా ప్రమోట్ చేయటానికి చిత్ర నిర్మాణ సంస్ద  మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌  ట్రిక్ ప్లే చేసింది.   
 
దాంతో చాలా మంది ఈ సినిమా రిలీజవకముందే సినిమా ఎలా అప్‌లోడ్‌ చేస్తారు? అని నిర్మా సంస్ద షేర్ చేసిన యూట్యూబ్‌ లింకును క్లిక్‌ చేస్తున్నారు జనాలు. తీరా లింక్‌ ఓపెన్‌ అవగానే అలీ రెజా, సయామీ ఖేర్‌ ప్రత్యక్షమై "పైరసీ ఆపండి. వైల్డ్‌డాగ్‌ థియేటర్‌లోనే చూడండి" అని వస్తోంది.  ఆ వీడియో నిడివి 2 గంటల 9 నిమిషాలు కాగా, మొదటి నుంచి చివరివరకు ఇదే సందేశం దర్శనమిస్తోంది. దాంతో మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ జనాలను ఏప్రిల్ ఫూల్ చేయడంతో పాటు, తమ చిత్రానికి వినూత్న రీతిలో ప్రచారం కల్పించినట్టయింది. అలా నాగార్జున ఫ్యాన్స్‌ను ఏప్రిల్‌ ఫూల్‌ చేశారు. ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్‌ 2న) రిలీజ్‌ అవుతోంది.