శ్రీనువైట్ల దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు.. వైట్ల 'బ్రూస్ లీ' సినిమా చేస్తోన్న సమయంలో నెక్స్ట్ సినిమా అఖిల్ తో చేయాలి.

కానీ బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ కావడంతో నాగార్జున.. వైట్లతో రిస్క్ చేయాలని అనుకోలేదు. అయితే వైట్లకి మరో ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు నాగ్. 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమా సక్సెస్ అయితే వెంటనే అఖిల్-వైట్ల కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేయాలనుకున్నాడు.

ఈ మేరకు వైట్లతో చర్చలు కూడా చేశాడు. కానీ వైట్ల హిట్ సినిమా ఇవ్వలేకపోయాడు. దీంతో నాగార్జున మొహం చాటేశాడు. వైట్ల ఒకసారి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా.. నాగార్జున 
మాత్రం పట్టించుకోవడం లేదట.

దీంతో మరోసారి వైట్లకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం శ్రీనువైట్ల చేతిలో సినిమాలేవీ లేవు. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాకు పని చేసిన రచయితలతో కలిసి మరో కథను రాసుకుంటున్నాడు. ఓ పక్క తన పరిచయాలతో హీరోల కోసం వెతుకుతున్నాడు. మరి శ్రీనువైట్లతో రిస్క్ చేసే ఆ హీరో ఎవరో చూడాలి!