వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీ ఉంటుందనివార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. నాలుగైదు సినిమాలు ఇప్పటికే లైన్ లో ఉన్నాయి. వీటిల్లో నాగార్జున సినిమా కూడా ఉంది. నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య కాంబినేషన్ లో 'బంగార్రాజు' సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా మొదలుకాలేదు. నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాగ్ 'బంగార్రాజు' పూర్తి చేసి సంక్రాంతికి బరిలోకి దింపుతాడని అన్నారు. 

కానీ ఈ సినిమాను సంక్రాంతికి కాకుండా వచ్చే ఏడాది సమ్మర్ కి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల నుండి దాదాపు మూడు నెలల పాటు నాగార్జున బిగ్ బాస్ షోతో బిజీగా ఉంటారు. అలానే చైతు.. 'వెంకీ మామ' ఆ తరువాత శేఖర్ కమ్ముల సినిమాలను పూర్తి చేయాల్సివుంది.

దీంతో సంక్రాంతికి 'బంగార్రాజు' రిలీజ్ అంటే హడావిడి అయిపోతుంది. పైగా బరిలో మహేష్, బన్నీ, రజినీకాంత్ సినిమాలు ఉండడంతో నాగార్జున డ్రాప్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.  ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను పూర్తి చేసి సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.