కింగ్ నాగార్జున నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ మన్మథుడు 2 ప్రమోషన్స్ డోస్ గట్టిగానే పెరుగుతోంది. రీసెంట్ గా రకుల్ కి సంబందించిన టీజర్ కుర్రకారును హీటెక్కించిన సంగతి తెలిసిందే. సాహో సినిమా మూడ్ ను డైవర్ట్ చేయాలంటే ఈ రేంజ్ లో రచ్చ చేయాల్సిందే. ఇక బిజినెస్ డీల్స్ ను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నాడు. 

అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ్ ఈ సినిమాను సొంతంగా నిర్మించారు. ఇకపోతే సినిమా ఓవర్సీస్ డీల్ కాస్త కంగారుపెడుతున్నట్లు  టాక్.  సాహో పోటీగా ఉండడంతో  రిస్క్ చేయడానికి కాస్త కంగారు పడుతున్నారు. మన్మథుడు 2 ఓవర్సీస్ లో 1.5కోట్ల ధర పలికినట్లు సమాచారం. సినిమా మార్కెట్ కి తగ్గట్టుగా ఇది అనుకూలమైన ధర అయినప్పటికీ బయ్యర్లు ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. 

సాహో రిలీజ్ అయ్యేలోపు మన్మథుడు 2 పెట్టిన పెట్టుబడిని తెస్తుందా లేదా? అని సందేహిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎండింగ్ కు వచ్చేశాయి. అదే విధంగా బిజినెస్ డీల్స్ ను కూడా ఎండ్ చేయాలనీ నాగ్ ఆలోచిస్తున్నారు. మరి నాగ్ లెక్కలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.