బిగ్ బాస్ సీజన్-4 లో పాల్గొనే వాళ్ల పేర్లు ఎలాగూ త్వరలో బయటకు వస్తాయి కానీ హోస్ట్ చేయబోతున్నారనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. నాగార్జున పేరు గట్టిగా వినిపిస్తోండగా చివరి నిమిషం దాకా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కరోనా తాకిడి వల్ల తన సినిమాలనే పక్కన పెట్టిన నాగ్ ఈ షోకు రెండో సారి కొనసాగుతారా అనే అనుమానం జనంలో లేకపోలేదు. 

నిజానికి బిగ్ బాస్ సీజన్-4కు ఎవరు హోస్ట్ గా వ్యవహించబోతున్నారనే విషయమై పెద్ద సస్పెన్స్ అయితే లేదు కానీ, స్టార్ మా వాళ్లు క్లారిటీ ఇవ్వకపోవటంతో సందిగ్దత అయితే ఉంది. అయితే సీజన్-3కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే, సీజన్-4కు కూడా వస్తున్నారంటూ బయటపెట్టింది శ్రీముఖి.

"మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి కదా. అవన్నీ వంద శాతం కరెక్ట్. సీజన్-4కు కూడా నాగార్జున గారే హోస్ట్ అని ఆల్ మోస్ట్ కన్ ఫర్మ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. అవి నిజమని నేను కూడా నమ్ముతున్నాను." అంది శ్రీముఖి. 

ఇక బిగ్ బాస్ సీజన్-3లో హౌజ్ లోకి వెళ్లిన శ్రీముఖి, ఫైనల్స్ వరకు వచ్చిన విషయం తెలిసిందే. లాస్ట్ మినిట్ లో టైటిల్ ను రాహుల్ సిప్లిగంజ్ తన్నుకుపోవడంతో, రన్నరప్ గా మిగిలిపోయింది. బిగ్ బాస్ నిర్వాహకులతో ఇప్పటికీ టచ్ లో ఉండే శ్రీముఖి చెప్పిందంటే...ఆ మ్యాటర్ ఖచ్చితంగా నిజం అవుతుంది.

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూనే పకడ్భందీగా ఈ షోని నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. దాంతో ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ రెండు వారాలు ముందుగానే బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలనే కండీషన్ పెట్టారట! అక్కడ డాక్టర్లు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులని చెక్ చేస్తారట! ఇష్యూస్ ఏమీ లేకపోతే వారితోనే షోని కంటిన్యూ చేస్తారట నిర్వాహకులు.! అదీ విషయం.